Shruti Haasan: అమెజాన్ ప్రైమ్‌లో బెస్ట్ సెల్లర్ సిరీస్.. కీలకపాత్రలో శ్రుతి హాసన్..
కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ
కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్ (Shruti Haasan). అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ అనంతరం శ్రుతికి టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటీవల క్రాక్ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చింది ఈ అమ్మడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ మూవీలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. శ్రుతి హాసన్ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు బెస్ట్ సెల్లర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో ముక్కల్ అభ్యంకర్ ఈ వెబ్ సీర్స తెరకెక్కించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్డేట్ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 18న ఈ వెబ్ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. రవి సుబ్రమణియన్ నవల ది బెస్ట్ సెల్లర్ ఆధారంగా దీనిని రూపొందించారు. ఇందులో సూపర్ స్టార్ నవలా రచయితగా మిథున్ చక్రవర్తి .. ఆయన ప్రేయసిగా శ్రుతి హాసన్ నటిస్తున్నారు.
bringing y’all the next big read ? #BestsellerOnPrime, new series, Feb 18@AlchemyFilms @shrutihaasan #MithunChakraborty @GAUAHAR_KHAN @ArjanTalkin @satyajeet_dubey @meSonalee @sidpmalhotra @sapnasmalhotra @mukulabhyankar #AnvitaDutt @Sam_arria pic.twitter.com/Pqzw7mM7fi
— amazon prime video IN (@PrimeVideoIN) January 28, 2022
Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..