Kitchen Tips: ఫ్రిడ్జ్ లో ఈ ఐటెమ్స్ పెడుతున్నారా.. పొరపాటున కూడా అలా చేయకండి!

|

Nov 13, 2023 | 10:22 PM

ఫ్రిడ్స్ వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ఐటెమ్ అయినా కూడా ఫ్రిడ్జ్ లోకి వెళ్లి పోతుంది. కూరగాయలు, రకరకాల నూనెలు, పండ్లు, ఫుడ్ ఐటెమ్స్, కూరలు ఇలా చాలా ఒక్కటేంటి ఫ్రిడ్జ్ లోకి చేరి పోతున్నాయి. ఆహారాలు నిల్వ ఉంటున్నాయి అనుకుంటున్నారు. కానీ ఆ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఆలోచించడం లేదు. అయితే కొన్ని రకాల ఫుడ్ ఐటెట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టక పోవడమే మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే..

Kitchen Tips: ఫ్రిడ్జ్ లో ఈ ఐటెమ్స్ పెడుతున్నారా.. పొరపాటున కూడా అలా చేయకండి!
Fridge
Follow us on

ఫ్రిడ్స్ వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ఐటెమ్ అయినా కూడా ఫ్రిడ్జ్ లోకి వెళ్లి పోతుంది. కూరగాయలు, రకరకాల నూనెలు, పండ్లు, ఫుడ్ ఐటెమ్స్, కూరలు ఇలా చాలా ఒక్కటేంటి ఫ్రిడ్జ్ లోకి చేరి పోతున్నాయి. ఆహారాలు నిల్వ ఉంటున్నాయి అనుకుంటున్నారు. కానీ ఆ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఆలోచించడం లేదు. అయితే కొన్ని రకాల ఫుడ్ ఐటెట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టక పోవడమే మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. మరి ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయిల్స్:

చాలా మంది కొన్ని రకాల ఆయిల్స్ అంటే కొబ్బరి, ఆలీవ్, బాదం, తేనె, వెజిటేబుల్, వంట నూనె ఇలా చాలా రకాల నూనెలు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్ లో వీటిని పెడితే గట్టి పడిపోతాయి. మళ్లీ వేడి చేసి ఉపయోగించ కూడదు. కాబట్టి వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టక పోవడమే బెటర్.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి:

చాలా మంది వెల్లుల్లి రెబ్బలను కూడా వలిచి డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో పెడుతూంటారు. వీటి వల్ల వెల్లుల్లి రుచి కోల్పోతుంది. అంతే కాకుండా అవి సాఫ్ట్ గా అయిపోతాయి. కాబట్టి వీటిని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకండి.

టమాటాలు – బంగాళా దుంపలు:

టమాటాలను ఫ్రిడ్జ్ లో పెడితే వాటి టేస్ట్, ఆకృతి కూడా పాడై పోతుంది. కాబట్టి వీలైనంత వరకూ వీటిని ఫ్రిడ్జ్ లో కంటే బయట పెట్టుకోవడమే బెటర్. అలాగే బంగాళా దుంపలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అందులో ఉండే పిండి పదార్థాలు విచ్ఛిన్నం అవుతాయి. దీంతో వీటిని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టక పోవడమే ఉత్తమం.

ఉల్లిపాయలు:

కొంత మంది ఉల్లి పాయలను కూడా ఫ్రిడ్జ్ లో పెడుతూంటారు. దీని వల్ల ఉల్లి పాయల్లోని తేమ పోతుంది. అలాగే మెత్తగా మారిపోతాయి.. ఫ్రిడ్జ్ లో కూడా వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకండి.

అరటి పండ్లు:

అరటి పండ్లను అసలు ఎప్పుడూ ఫ్రిడ్జ్ లో పెట్ట కూడదు. అందులో పెట్టడం వల్ల రుచి కోల్పోయి నిర్జీవంగా ఉంటాయి. అంతే కాకుండా.. ఫ్రిడ్జ్ అంతా కూడా బనానా స్మెల్ వస్తుంది. కాబట్టి వీటిని బయట పెట్టడమే మంచిది.

బ్రెడ్:

బ్రెడ్ ని కూడా ఫ్రిడ్జ్ లో నిల్వ చేయక పోవడమే బెటర్. ఎందుకంటే బ్రెడ్ లోని ఉండే స్టార్చ్ విచ్ఛిన్నం అవుతుంది. దీని వల్ల బ్రెడ్ త్వరగా పాడై పోయే అవకాశం ఉంది. కాబట్టి బ్రెడ్ ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టక పోవడమే ఉత్తమం.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.