
పానీ పూరి అనేది ఒక ఎమోషన్. ఇది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. పానీ పూరిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తూంటారు. ఎలా పిలిచినా.. ఎలా చేసినా.. దీని టేస్ట్ మాత్రం వావ్ అని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. పానీ పూరికి ఫ్యాన్స్ ఎక్కువే. రోజు రోజుకూ దీనికి డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. పానీ పూరిని ఇష్ట పడని వారుండరు. చిన్న పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. రోజూ తిన్నా ఇంకా తినాలనిపించే స్ట్రీట్ ఫుడ్ ఇది. బయటకు వెళ్లే వారు దీన్ని టేస్ట్ చేయలేకుండా ఉండలేరు. అయితే చాలా మంది పానీ పూరి.. ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతూ ఉంటారు.
పానీ పూరి కేవలం స్ట్రీల్ ఫుడ్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది బెస్ట్ డైట్ ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పానీ పూరి వల్ల చేసే విధానం.. శుభ్రమైన వాతావరణం.. అంతా వ్యాపారి పైన ఆధార పడి ఉంటుంది. కాబట్టి పరి శుభ్రంగా మంచి ప్రమాణాలు పాటించే వద్ద పానీ పూరి తినడం తప్పు కాదని నిపుణులు అంటున్నారు. మరి పానీపూరి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఆరోగ్యానికి ఎలా మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటీస్ తో బాధ పడేవారు ఏది తినాలన్నా భయ పడి పోతూ ఉంటారు. ఏది తిన్నా బ్లడ్ లో షుగర్ లెవల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇలా షుగర్ తో బాధ పడేవారు ఎలాంటి టెన్షన్ లేకుండా పానీ పూరి తినొచ్చు. పానీ పూరిలో కేలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అయితే మంచిది అన్నారు కదా అని మరీ ఎక్కువ మోతాదులో కాకుండా.. లిమిట్ గా తింటే ఆరోగ్యానికి బెస్ట్.
పానీ పూరిలో మీ శరీరానికి అవసరం అయిన పోషకాలు లభ్యమవుతాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పానీ పూరి తినడం వల్ల.. ఐరన్ లోపంతో నుంచి బయట పడొచ్చు. పానీ పూరిలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఫోలేట్, విటమిన్లు ఏ, బి6, బి12, సీ, డీ వంటివి ఉంటాయి.
పానీ పూరి అంటే చాలా మందికి ఇష్టం. పానీ పూరి తినడానికి కాలంతో పని లేదు. ఇది మానసిక స్థితి మెరుగు పరుస్తుంది. ఎలాంటి మూడ్ లో ఉన్నా మీ మానసిక స్థితి వెంటనే చేంజ్ అయి పోతుంది. పానీ పూరి తినడం వల్ల తక్షణమే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అంతే కాకుండా నోటి బొబ్బలు ఉన్న వారు తిన్నా ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.