దాల్చిన చెక్కతో అద్భుతాలు..! ఇలా వాడితే చాలు.. ఏ జబ్బులు రావు..!
దాల్చిన చెక్క కేవలం వంటింట్లో రుచి కోసమే కాదు.. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే సూపర్ ఫుడ్. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, శరీరంలో వాపును తగ్గించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, బరువును నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

మన వంటింట్లో దాల్చిన చెక్క ఒక ప్రత్యేకమైన మసాలా. ఇది వంటలకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా.. చాలా ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర అదుపు, గుండె ఆరోగ్యం, వాపు తగ్గించడం, మెదడు పనితీరు, బరువు నియంత్రణ వంటి అనేక విషయాల్లో దీని పాత్ర చాలా కీలకం.
మధుమేహానికి బెస్ట్ ఫ్రెండ్
మధుమేహం ఉన్నవారికి దాల్చిన చెక్క ఒక సహజమైన స్నేహితుడు. ఇందులో ఉండే సిన్నమాల్డిహైడ్ (Cinnamaldehyde), పాలీఫెనాల్స్ అనే పదార్థాలు ఇన్సులిన్ లాగా పని చేస్తాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లోకి వస్తాయి.
గుండె ఆరోగ్యానికి మేలు
దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది. అలాగే రక్తపోటును సమతుల్యం చేసి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు
దాల్చిన చెక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీంతో వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది.
వాపు నివారణ
దీనిలో ఉండే వాపును తగ్గించే గుణాలు శరీరంలోని అంతర్గత వాపును తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ఉపశమనం ఇస్తుంది.
మెదడుకు బూస్టర్
దాల్చిన చెక్కలోని సహజ పదార్థాలు జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచి మెదడును చురుగ్గా ఉంచుతాయి. నాడీ సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఇది రక్షణ ఇస్తుంది.
జీర్ణక్రియ సర్దుబాటు
కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం లాంటి సమస్యలను తగ్గించడంలో దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
బరువు తగ్గడానికి బెస్ట్ ఫ్రెండ్
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా దాల్చిన చెక్క ఆకలిని అదుపు చేస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా తీపి పదార్థాలు తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది.
మనసుకు ప్రశాంతత
దాల్చిన చెక్కలో ఉండే మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి. తలనొప్పి, చిరాకు వంటి వాటిని కూడా తగ్గిస్తాయి.
నోటి ఆరోగ్యం
దాల్చిన చెక్కలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు చిగుళ్లను బలంగా ఉంచి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. అందుకే చాలా మౌత్ వాష్ లలో దీన్ని వాడతారు. ఈ అన్ని ప్రయోజనాలను పొందడానికి దాల్చిన చెక్కను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




