Bitter Gourd Benefits: వేసవి నుంచి వర్షాకాలంలో అడుగు పెట్టాం.. ఈ సీజనల్ లో ఎక్కువగా సీజనల్ వ్యాధులైన జలుబు, జ్వరం, దగ్గువంటి వ్యాధుల బారిన పడతాం. వర్షాల వలన నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు పెరిగి.. మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి అనేక రకాల వ్యాధులు విజృంభిస్తుంటాయి. అయితే ఇలా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలి. తినే ఆహారంలో కాకరకాయని చేర్చుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అయితే కూరగాయల్లో ఒకటైన కాకరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. అయినా దీనిని చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే చేదుగా ఉంటుందని వికారంగా ముఖం పెడతారు. ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయని వర్షాకాలంలో తింటే ఎన్నో జబ్బుల నుంచి రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో కాకర కాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
*కాకయ కాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దీంతో సీజనల్ వ్యాధులు, వైరస్‌ల బారి నుంచి రక్షణ ఇస్తుంది.
*కాకర కాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది.
* కాకరకాయ తరచుగా తినడం వలన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
*గుండె జబ్బులు రాకుండా రక్షణ ఇస్తుంది
* కాకర కాయ జ్యూస్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి జబ్బులు దరిచేరవు
*కాకర కాయలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
* కాకర కాయ జ్యూస్‌ను తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలో రళ్లు కరుగుతాయి.
*ఇక షుగర్ వ్యాధిగ్రస్తులకు కాకర కాయ దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఆల్కలైడ్లు బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తాయి.
సీజనల్ వ్యాధుల బారిన పడి మెడిసిన్స్ ను ఆశ్రయించే బదులు.. ఈ వర్షాకాలంలో కాకర కాయను రెండు రోజులకు ఒకసారైనా తినే ఆహారంలో చేర్చుకుని ఆరోగ్యంగా ఉండమని అంటున్నారు పోషకాహార నిపుణులు..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
( ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)