AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lungs Infection: కరోనా నుంచి కోలుకున్న తర్వాత వెంటాడుతున్న ఊపిరితిత్తుల ఫైబ్రోసిన్ వ్యాధి.. దీనిని ఎలా నివారించాలి..?

Lungs Infection: కరోనా నుండి కోలుకున్న తర్వాత, ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత కూడా అలసట, జుట్టు రాలడం, బలహీనత, గుండె ..

Lungs Infection: కరోనా నుంచి కోలుకున్న తర్వాత వెంటాడుతున్న ఊపిరితిత్తుల ఫైబ్రోసిన్ వ్యాధి.. దీనిని ఎలా నివారించాలి..?
Subhash Goud
|

Updated on: May 13, 2022 | 12:30 PM

Share

Lungs Infection: కరోనా నుండి కోలుకున్న తర్వాత, ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత కూడా అలసట, జుట్టు రాలడం, బలహీనత, గుండె జబ్బులను ఎదుర్కొంటున్నారు. చాలా మంది రోగులు కరోనా నుండి కోలుకున్న నెలల తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వైద్యులు తెలిపిన ప్రకారం.. ఇది ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ (Lungs Fibrosis) వ్యాధి కావచ్చు. ఇది ప్రమాదకరమైన వ్యాధి. దీనిలో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కోవిడ్ సోకిన వారిలో ఫైబ్రోసిస్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి..? దానిని ఎలా నివారించవచ్చో నిపుణుల నుండి తెలుసుకుందాం.

నోయిడా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జగదా నంద్ ఝా వివరాల ప్రకారం.. లంగ్ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తుల వ్యాధి అని. ఇందులో ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం, కుంచించుకుపోవడం జరుగుతుందంటున్నారు. దీని కారణంగా ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం ప్రారంభమవుతుంది. అవి సరిగ్గా పనిచేయవు. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కొన్నిసార్లు రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయి కూడా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి. ఈ వ్యాధిని సకాలంలో నయం చేయకపోతే ఇది జీవితకాల వ్యాధిగా మారుతుంది.

ఈ మందులకు దూరంగా ఉండండి: 

ఇవి కూడా చదవండి

చాలా మందులు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. అలాంటి మందులు వాడకపోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

కీమో థెరపీ డ్రగ్స్: మెథోట్రెక్సేట్ (ట్రెక్సాల్, ఓట్రెక్సప్, ఇతరాలు) సైక్లోఫాస్ఫామైడ్ వంటి మందులు క్యాన్సర్ కణాలను చంపడానికి పని చేస్తాయి. అవి ఊపిరితిత్తుల కణజాలాన్ని కూడా దెబ్బతీస్తాయి. నైట్రోఫురంటోయిన్ (మాక్రోబిడ్, మాక్రోడాంటిన్, ఇతరాలు) లేదా ఇథాంబుటోల్ వంటి యాంటీబయాటిక్స్ మందులు ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి.

ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ లక్షణాలు

☛ శ్వాస ఆడకపోవుట

☛ పొడి దగ్గు

☛ బరువు నష్టం

☛ కండరాల, కీళ్ల నొప్పి

COVID తర్వాత ప్రజలలో ఈ సమస్య ఎందుకు పెరిగింది?

చాలా మంది రోగులకు కరోనా సోకినప్పుడు తీవ్రమైన లక్షణాలు ఉన్నాయని డాక్టర్ జగదా చెప్పారు. ఈ వైరస్ ప్రజల ఊపిరితిత్తులను దెబ్బతీసింది. పల్మనరీ లేదా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌కు కారణమవుతుంది. ముఖ్యంగా ICU సంరక్షణ, వెంటిలేటర్లు అవసరమయ్యే వృద్ధ రోగులలో ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నేటి కాలంలో పల్మనరీ ఫైబ్రోసిస్‌కు రోగుల పరిస్థితిని బట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒక వ్యక్తి కరోనా నుండి కోలుకున్న తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అప్పుడు వైద్యుడిని సంప్రదించాలని పల్మోనాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ వివరిస్తున్నారు. ఛాతీ నొప్పి ఉంటున్నట్లయితే ఛాతీకి CT స్కాన్ చేయాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి