Telugu News » Photo gallery » Know is it healthy to eat rice for lunch and dinner check here details
Health Tips: వేసవిలో అన్నం తింటే ఆరోగ్యానికి మంచిదేనా ? అసలు విషయం ఏంటో తెలుసుకోండి..
గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు, అభిప్రాయాల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది.. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.
సాధారణంగా మధుమేహం సమస్య ఉన్నవారు.. బరువు పెరగడం.. స్థూలకాయం సమస్యలతో ఇబ్బందిపడుతున్నవారు ఎక్కువగా అన్నం తీసుకోరు.. అలాగే .. ఇటీవల బరువు తగ్గడం కోసం.. డైట్ పేరుతో అన్నం తినకుండా సలాడ్స్ తీసుకుంటున్నారు. అలాగే వేసవిలో ఎక్కువగా అన్నం తినడానికి ఇష్టపడరు.. మరికొందరు మాత్రం మూడు పూటలు తినేస్తుంటారు.
1 / 6
కానీ.. వేసవిలో అన్నం రెండు పూటలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా ?.. అన్నం, బిర్యానీ, పోలా, చౌమిన్ తో అన్నంతో చేసినవే. వేసవిలో అన్నం ఎక్కువగా తినడం మంచిదో కాదో తెలుసుకోండి.
2 / 6
అన్నంతో కలిసి అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయని తెలిపింది. అన్నంతో శరీరానికి ఎక్కువ కేలరీలు ఉన్నాయి. అలాగే ఇందులో ఐరన్, సోడియం, ప్రోటీన్స్, విటమిన్ బి6, కాల్షియం, పీచు, కొవ్వు ఉంటుంది..
3 / 6
అయితే అన్నం ఎక్కువగా తింటే సులభంగా బరువు పెరుగుతారు.. అలాగే మధుమేహం సమస్యకు కూడా దారి తీస్తుందనే అపోహాలు ఉన్నాయి.. అయితే నిపుణుల అభిప్రాయాల ప్రకారం అన్నం తింటే బరువు పెరగరని.. మధుమేహం కూడా రాదని తెలిపారు. తెల్ల అన్నం కంటే బ్రౌన్ రైస్ మంచిదంటున్నారు.
4 / 6
అన్నం మోతాదు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.. అన్నం తక్కువగా పప్పులు, చేపలు, కూరలు, ఎక్కువగా తీసుకోవడం వలన కూడా అంతగా ప్రయోజనం ఉండదు. రాత్రిళ్లు అన్నం సరైన మోతాదులో తీసుకుంటే నిద్రకు భంగం ఉండదు.. కానీ శరీరంలోకి కేలరీలు చేరతాయి. వేసవిలో రెండు సార్లకు మించి అన్నం తినడం వలన ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు
5 / 6
గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు, అభిప్రాయాల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది.. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.