Winter Fruits: శీతాకాలంలో వేధించే సీజనల్‌ రోగాలు.. ఈ పండ్లతో చెక్‌ పెట్టచ్చు

|

Nov 07, 2022 | 10:55 AM

సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండడం చాలా ముఖ్యం. అందుకోసం ఆహారం, పానీయాల విషయంలో మరింత శ్రద్ధ వహించడం ఎంతో అవసరం. ఈ క్రమంలో వింటర్ లో పండ్లను బాగా తీసుకోవలంటున్నారు నిపుణులు. 

Winter Fruits: శీతాకాలంలో వేధించే సీజనల్‌ రోగాలు.. ఈ పండ్లతో చెక్‌ పెట్టచ్చు
Winter Fruits
Follow us on

ఇతర సీజన్లతో పోల్చితే శీతాకాలంలో అందం, ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలోని విపరీతమైన మార్పుల కారణంగా ఈ సీజన్‌లో జలుబు, ఫ్లూ వంటి సీజనల్‌ సమస్యలు తరచుగా ఎదురవుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండడం చాలా ముఖ్యం. అందుకోసం ఆహారం, పానీయాల విషయంలో మరింత శ్రద్ధ వహించడం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో వింటర్ లో  పండ్లను డైట్‌లో ఎక్కువగా చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.  ఇందులోని పలు పోషకాలు ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. చలికాలంలో మనకు నోరూరించే జ్యూసీ పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. ముఖ్యంగా ఆరెంజ్ వంటి పండ్లు చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవేకాదు చలికాలంలో ఆరోగ్యంగా , ఫిట్‌గా ఉంచడానికి దానిమ్మపండ్లు, యాపిల్స్, ఖర్జూరాలు కూడా ఎక్కువగా తీసుకుంటే మంచి ప్రయోజనముంటుంది.

నారింజ

చలికాలంలో నారింజ పండ్లు మన ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని విటమిన్ సి, ఆంథోసైనిన్లు గుండె, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.

పియర్

శీతాకాలంలో పియర్ తినవచ్చు. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమించడానికి తోడ్పడుతాయి.

ఇవి కూడా చదవండి

యాపిల్

చలికాలంలో యాపిల్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించి పలు సమస్యల నుండి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా మలబద్ధకం, అజీర్తి సమస్యలను అధిగమించవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇది సహాయపడుతుంది. ఇక రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.

జామ

జామను చలికాలంలో కూడా తినవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

దానిమ్మ

దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. చలికాలంలో దానిమ్మ రసం తీసుకోవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

అరటి పండ్లు

ఈ పండు చలికాలంలో శక్తిని అందించే పవర్‌హౌస్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా అధిక బీపీతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక అరటిపండును తప్పనిసరిగా తినాలంటున్నారు నిపుణులు. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..