Health Benefits: జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ ఆహార పదార్థాలను తినండి..
Health Benefits: ఆయిల్, కారంగా ఉండే వంటకాలు తిన్న తరువాత కడుపులో విసుగ్గా అనిపిస్తుంటి. ఇబ్బందిగా.. అజీర్తిగా.. మంటగా కూడా అనిపిస్తుంటి.
Health Benefits: ఆయిల్, కారంగా ఉండే వంటకాలు తిన్న తరువాత కడుపులో విసుగ్గా అనిపిస్తుంటి. ఇబ్బందిగా.. అజీర్తిగా.. మంటగా కూడా అనిపిస్తుంటి. అందుకే.. మనం తినే ఆహారం ఎప్పుడూ తేలికపాటిగా ఉండాలి. అలాంటి ఆహారాన్ని తిన్నప్పుడే.. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. మసాలా దినుసులు, నూనెలు తక్కువగా వాడిని ఆహారం తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మరి ఎలాంటి తేలికపాటి వంటకాలు తీనవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు అన్నం.. ఇది చాలా సులభమైన దక్షిణ భారత వంటకం. దీనిని నిమిషాల్లో తయారు చేయవచ్చు. ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. వండిన అన్నంలో పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి తినొచ్చు. ఇందులో టేస్టీ కోసం కొంచెం మసాలా దినుసులు, ఇతర పదార్థాలు వేసుకోవచ్చు.
ఖిచిడీ.. మీకు కడుపులో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పుడు ఖిచిడీ తినడం చాలా మంచింది. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది త్వరగా జీర్ణం అవటం వలన.. ప్రశాంతంగా ఫీల్ అవుతారు. అంతేకాదు.. లూజ్ మోషన్ సమస్య పరిస్కారం అవుతుంది. దీనిని బియ్యం, పప్నును కలిపి ఉడికించాలి. కొద్దిగా ఉప్పు, పసుపు, మసాలా దినుసులు కలిపి ఉడికించాలి. ఆ తరువాత ఖిచిడీ ఉడికాక.. వేడి వేడిగా తినేయాలి.
గుల్హత్.. కడుపు నొప్పిగా ఉంటే ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వంటకాన్ని తయారు చేయడం చాలా సులభం. దీని కోసం, కుక్కర్‌లో 2 కప్పుల నీరు, అర కప్పు బియ్యం వేయాలి. చిటికెడు ఉప్పు వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. కుక్కర్ తెరిచి బియ్యాన్ని మరింత మెత్తగా చేసుకోవాలి. దీన్ని ఊరగాయతో కలిపి వేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది.
చూడా దహి.. మీరు అల్పాహారంలో కూడా చుడా దహిని ఆస్వాదించవచ్చు. ఒక కప్పు పెరుగులో 1 కప్పు చుడా కలపండి. కావాలంటే మీరు చక్కెరను కూడా కలుపుకోవచ్చు. అలా దీనిని బాలా కలిపితే.. చూడా దహా రెడీ. ఈ అల్పాహారం చాలా ఆరోగ్యకరమైనది.
ఇడ్లీ.. ఇడ్లీ తయారీ పిండి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇడ్లీ పిండిలో కొద్దిగా నీరు కలపండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసి ఇడ్లీ మేకర్‌లో వేయండి. ఇడ్లీలను ఆవిరిలో ఉడికించి, బయటకు తీసి, వాటిపై కొద్దిగా నెయ్యి పోసి తింటూ ఆస్వాదించండి. ఇడ్లీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మీ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
Also read:
Apps for Farmers: ఈ మొబైల్ యాప్‌లతో రైతులకు ఎంతో మేలు.. ఇవి తెలిపే సమాచారం ద్వారానే రైతులకు..
Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..
Andhra Pradesh: ఏళ్లుగా సహజీవనం చేశాడు.. ఆమె కూతురుపైనా కన్నేశాడు.. కాదన్నందుకు కడతేర్చాడు..