ఎన్నోఏళ్ల నుంచి మానవునికి పెను సవాలుగా మారిన ముప్పు క్యాన్సర్. ప్రతిఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం అనేక మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఒక్కసారి ఎవరైనా ఈ వ్యాధికి గురయ్యాయ్యారంటే వారు ప్రాణాలతో ఉంటారా లేదా అనే విషయమే ప్రశ్నర్థకమే అవుతుంది. క్యాన్సర్ తీవ్రత పెరగకుండా మొదట్లోనే గుర్తిస్తే ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే ప్రతిరోజు సావాసం చేయాల్సిందే. చాలామంది బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రీస్ట్ క్యాన్సర్ వంటివాటితో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే భారతీయ పురుషుల్లో క్యాన్సర్ మరణాలు ప్రతి ఏడాది ద.19 చొప్పున తగ్గుతున్నాయి. కానీ మహిళల్లో మాత్రం 0.25 శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని కొచ్చిలోని అమృత ఆస్పత్రి వైద్యుల అధ్యయనం తెలిపింది. 2000-2019 మధ్య కాలంలో గమనిస్తే భారత్‌లో క్యాన్సర్ మరణాలపై జరిగిన అధ్యయనంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డాక్టర్ క్యాథరీన్ సౌవాజే కూడా భాగస్వాములయ్యారు.
2000-2019 మధ్యన భారతదేశంలో దాదాపు 23 రకాల క్యాన్సర్ల వల్ల కోటీ 28 లక్షల మందిపైగా భారతీయులు మరణించడం చాలా ఆందోళనకర విషయం. ప్రపంచ వ్యాప్తంగా హృద్రోగం తర్వాత ఎక్కవ మంది ప్రాణాలు తీస్తోంది క్యాన్సర్ వ్యాధి. 2020 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 99 లక్షల మంది క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచ క్యాన్సర్ మరణాల్లో దాదాపు 9 శాతం మరణాలు భారతదేశంలోనే జరుగుతున్నాయి. 2000-2019 మధ్య ఇండియాలో స్త్రీ పురుషులిద్దరిలో ఎక్కవ మంది క్లోమగ్రంథి క్యాన్సర్ వల్ల చనిపోయారు. అదే కాలంలో ఉదరం, అన్నవాహిక, లుకేమియా. మెలనోమా వంటి క్యాన్సర్ మరణాలు తగ్గాయి. మహిళల్లో ఎక్కవగా పిత్తాశయ, థైరాయిడ్ క్యాన్సర్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అలాతే క్లోమ గ్రంథి క్యాన్సర్ మరణాలు కూడా స్త్రీలలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి క్యాన్సర్లు స్త్రీ, పురుషులకు పెను సవాలు విసురుతున్నాయి. క్యాన్సర్ లక్షణాల ముందుగానే గుర్తించి అవసరమైన వసతులు భారత్‌లో అందించాలని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే క్యాన్సర్ చికిత్సకు నిపుణులు, సహాయక సిబ్బందికి ఎక్కవ సంఖ్యలో తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు.