AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఖాళీ కడుపుతో ఏ పండ్లు తింటే ప్రయోజనం కలుగుతుందో తెలుసా? కీలకమైన సమాచారం మీకోసం..

Health News: ప్రస్తుత కాలంలో ఫిట్‌గా ఉండటం అనేది చాలా పెద్ద టాస్క్. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలితో పాటు.. శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవాలి. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. సరైన పండ్లు, కూరగాయలు తినాలి. పండ్లు, మంచి కూరగాయలు తినడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోజును ఆరోగ్యంగా ప్రారంభించాలంటే పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Health Tips: ఖాళీ కడుపుతో ఏ పండ్లు తింటే ప్రయోజనం కలుగుతుందో తెలుసా? కీలకమైన సమాచారం మీకోసం..
Fruits
Shiva Prajapati
|

Updated on: Jul 29, 2023 | 10:05 PM

Share

Health Tips: ప్రస్తుత కాలంలో ఫిట్‌గా ఉండటం అనేది చాలా పెద్ద టాస్క్. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలితో పాటు.. శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవాలి. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. సరైన పండ్లు, కూరగాయలు తినాలి. పండ్లు, మంచి కూరగాయలు తినడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోజును ఆరోగ్యంగా ప్రారంభించాలంటే పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే పండ్లు తినడం వలన రోజంతా చురుకుగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏ పండ్లు తినాలి? ఏం తింటే మంచిది? అనే ప్రశ్న తలెత్తుతుంది. మరి ఉదయాన్నే ఏం పండ్లు తింటే మేలు జరుగుతుందో ఇవాళ మనం తెలుసుకుందాం..

పండ్లు తినడానికి సరైన సమయం ఏది?

ఖాళీ కడుపుతో తినే పండ్లు కొన్ని ఉన్నాయి. వీటిని అల్పాహారం, మధ్యాహ్న భోజనం మధ్య సమయంలో అంటే ఉదయం 10 నుండి 12 గంటల మధ్య కూడా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పండ్లను ఉదయం సమయంలో తినాలి. తద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఖాళీ కడుపుతో తినవలసిన పండ్లు..

కివి: ఈ పండ్లలో చాలా పోషకాలు ఉన్నాయి. వీటిని ఖాళీ కడుపుతో తినొచ్చు. డెంగ్యూ బారిన పడిన వారికి కివి చాలా మంచిది. దీని వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండి శరీరానికి శక్తి అందుతుంది.

ఇవి కూడా చదవండి

ఆపిల్: ఖాళీ కడుపుతో ఆపిల్ పండ్లను కూడా తినవచ్చు. దీని వల్ల బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు శరీరంలో పోషకాల కొరత కూడా తీరుతుంది. మలబద్ధకం, సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది.

దానిమ్మ: ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో దానిమ్మ పండ్లను తినడం వలన ప్రయోజనం ఉంటుంది. దానిమ్మ తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

బొప్పాయి: బొప్పాయి తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. బరువు అదుపులో ఉండాలంటే బొప్పాయి ఉత్తమం. అలాగే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్