Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coffee: రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఆ వ్యాధులు మీ దరిచేరవు.. 

రోజూ కాఫీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో రోజూ కాఫీ తాగే వారిలో ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, కార్డియో వాస్కులర్ వ్యాధులు దూరమైనట్లు తేలిందట.

Coffee: రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఆ వ్యాధులు మీ దరిచేరవు.. 
Hot Coffee
Follow us
Madhu

|

Updated on: Mar 16, 2023 | 6:30 PM

కాఫీ.. కొందరు దీనికి బానిసలు. ఉదయాన్నే లేవడమే వారికి మంచంపైనే పొగలు కక్కే కాఫీ కావాలి. అది తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. 24 గంటల్లో మూడు, నాలుగు సార్లు కాఫీ తాగే వారు కూడా ఉంటారు. అయితే చాలా మంది కాఫీ తాగడం వల్ల చాలా ఇబ్బందులొస్తాయని చెబుతుంటారు. కానీ రోజూ కాఫీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో రోజూ కాఫీ తాగే వారిలో ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, కార్డియో వాస్కులర్ వ్యాధులు దూరమైనట్లు తేలిందట. కాఫీలో కెఫిన్ కారణంగా ఈ ఫలితాలు వచ్చినట్లు వారు నిర్ధారించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వాటికి చెక్..

అధిక మొత్తంలో కెఫిన్ స్థూలకాయం, టైప్ 2 మధుమేహం, ప్రధాన హృదయ సంబంధ వ్యాధులను తగ్గించగలదని ఒక అధ్యయనం తెలిపింది. బీఎంజే మెడిసిన్ జర్నల్‌లో ఇది ప్రచురితమైంది. ఈ అధ్యయనం ప్రకారం ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడానికి ఉపయోగించే క్యాలరీ-రహిత పానీయాలను కెఫిన్ భర్తీ చేయగలదని వివరించారు. అయితే దీనిపై మరింత లోతైన పరిశీలన అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. టైప్ 2 మధుమేహం అనేది శరీరం తగినంత ఇన్సులిన్ (హార్మోన్) ఉత్పత్తి చేయనప్పుడు లేదా దాని ఉత్పత్తిని నిరోధించినప్పుడు వచ్చే జీవనశైలి రుగ్మత.

ఎక్కువ తాగమని చెప్పడం లేదు..

ఈ అధ్యయనం ప్రకారం అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడంతో ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతున్నట్లు చెప్పారు. కానీ ఇది అధికంగా కాఫీ తాగమని ప్రోత్సహించడం లేదు అని ఈ అధ్యయనంలో సభ్యులు, ఎక్సెటర్ విశ్వవిద్యాలయంలో సీనియర్ లెక్చరర్ డాక్టర్ కటారినా కోస్ అన్నారు.

ఇవి కూడా చదవండి

పరిశోధన ఎలా చేశారంటే..

పరిశోధకులు మెండెలియన్ రాండమైజేషన్ అనే సాంకేతికతను ఉపయోగించి ఈ అధ్యయనాన్ని చేశారు. ఇది జన్యు ఆధారాల ద్వారా శరీరంలోని మార్పులకు కారణాలు, అలాగే కెఫిన్ ప్రభావాన్ని గుర్తిస్తుంది. రెండు సాధారణ జన్యు విధానాలు కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతుందని, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)తో పాటు శరీరంలోని కొవ్వుపై కూడా ప్రభావం చూపుతుందని వివరించింది. కెఫిన్ కారణంగా బరువు తగ్గడంతో పాటు టైప్ 2డయాబెటిస్ ప్రమాదం సగానికి తగ్గిందని నిర్ధారించింది. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది. కొవ్వులను కరిగించేందుకు సాయపడుతుంది.

రోజుకు ఎంత మోతాదులో కాఫీ తీసుకోవాలి..

రోజుకు100ఎంజీ కెఫిన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని, అంతకు మించి తీసుకుంటే మళ్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ప్రమాదం ఉందని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. అయినప్పటికీ దీని మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని, అప్పుడే కచ్చితమైన అభిప్రాయానికి రావడం సరికాదని పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనా కెఫిన్ తో ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుండటం శుభసూచకమని స్పష్టం చేశారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..