AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19: నిను వీడని నీడను నేను అంటున్న కరోనా! విపరీతమైన డిప్రెషన్..  గుండె జబ్బులు.. పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు..

వైరస్ కారణంగా మనిషిలో విపిరీతమైన ఒత్తిడి పెరిగిందని పరిశోధకులు వివరిస్తున్నారు. కరోనా సోకినా, సోకకపోయినా మనిషిలో అంతర్లీనంగా ఏర్పడిన భయం, ఫోబియా కారణంగా గుండె జబ్బులు చుట్టుముడుతున్నట్లు గుర్తించామన్నారు.

COVID-19: నిను వీడని నీడను నేను అంటున్న కరోనా! విపరీతమైన డిప్రెషన్..  గుండె జబ్బులు.. పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు..
Depression And Heart
Madhu
|

Updated on: Mar 07, 2023 | 10:02 AM

Share

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసేసింది. వేలాది మంది ప్రాణాలను హరించింది. లక్షలాది మందిని ఆస్పత్రుల పాల్జేసింది. అన్ని రంగాలను కుదేలు చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది. నెమ్మదిగా ఈ సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడుతోంది. ఇదంతా ఒకవైపు అయితే.. కరోనా వైరస్ అనేది మనిషిని మానసికంగా కోలుకోలేని దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ కారణంగా మనిషిలో విపిరీతమైన ఒత్తిడి పెరిగిందని వివరిస్తున్నారు. కరోనా సోకినా, సోకకపోయినా మనిషిలో అంతర్లీనంగా ఏర్పడిన భయం, ఫోబియా కారణంగా గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక రోగాలు చుట్టుముడుతున్నట్లు గుర్తించామన్నారు.

పరిశోధన ఇలా..

కోవిడ్ 19 సమయంలో మనిషి మానసిక స్థితిపై పరిశోధకులు ఓ అధ్యయనాన్ని చేశారు. దాదాపు 136,000 మంది రోగులపై ఈ అధ్యయనం చేశారు. వారి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరోనా విజృంభించిన సమయంలో మనిషిలో డిప్రెషన్, యాంగ్జైటీ లక్షణాలు గణనీయంగా పెరిగాయని కనుగొన్నారు. రోగులలో సగానికి పైగా డిప్రెషన్‌లో ఉన్నట్లు నివేదించారు. ఇది గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీయవచ్చని అభిప్రాయ పడ్డారు. వీరిలో డిప్రెషన్, యాంగ్జయిటీ, స్ట్రెస్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) కోసం రోగులను పరీక్షించడం, చికిత్స చేయడం చాలా ముఖ్యం అని పరిశోధకులు కనుగొన్నారు. ఈ మానసిక ఆరోగ్య సమస్యలు అధిక రక్తపోటు, జీవక్రియ వ్యాధి, గుండె జబ్బులతో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు.

రోగుల ఫీడ్ బ్యాక్ ఇలా..

డిప్రెషన్ లక్షణాలు కరోనా పాజిటివ్ రోగులలోనూ, అలాగే సాధారణ ప్రజలలోనూ అదే విధంగా ఉన్నాయిని ఈ పరిశోధన నిర్ధారించింది. పరిశోధనకులు రోగులలోని డిప్రెషన్ ను స్క్రీన్ చేయడానికి ఫస్ట్ పేషంట్ హెల్త్ కేర్ క్వషనరీ-9(పీహెచ్-9) అనే దానిని నిర్వహించారు. దీనిలో కొన్ని ప్రశ్నలు రోగులకు అడిగి సమాధానాలు రాయించారు. ఈ ప్రశ్నలకు ప్రజలు ఇచ్చిన జవాబులను విశ్లేషించిన పరిశోధకులు.. వారి డిప్రెషన్ స్థాయిలను నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ ప్రశ్న పత్రంలో (<10) స్కోర్ వస్తే డిప్రెషన్ అస్సలు లేదని.. 10-14 వస్తే మైల్డ్.. 15-19 వస్తే మోడరేట్ అని.. (>20) వస్తే సివియర్ అని విభాగించారు. మొత్తం మీద దాదాపు 45శాతం మంది రోగుల్లో కరోనా ప్రారంభ సమయంలో కొంత మేర డిప్రెషన్ ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఇది 2021కి వచ్చేసరికి 55 శాతానికి పెరిగింది. దీనిలో కరోనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పెద్దగా తేడా లేకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

భవిష్యత్తులో ఇబ్బందులు..

డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, పీఎస్టీడీ, అధిక రక్తపోటు, అధిక స్థాయి కార్టిసాల్‌తో ముడిపడి ఉన్నాయి. ఇది ధమనులలో కాల్షియం ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో గుండె జబ్బులు ప్రబలే అవకాశం ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?