AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖంపై ఈ 5 లక్షణాలు కనిపిస్తే డేంజర్.. మీ కిడ్నీలు షెడ్డుకెళ్లడానికి రెడీగా ఉన్నట్లే..

మూత్రపిండాలు.. రక్తాన్ని ఫిల్టర్ చేసే ముఖ్యమైన బాధ్యతను నిర్వహిస్తాయి. కిడ్నీలు దెబ్బతిన్నట్లయితే, శరీరం అంతటా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. దురదృష్టవశాత్తు, చాలా మంది మూత్రపిండ వైఫల్యం తీవ్రమైన దశకు చేరుకున్న తర్వాత మాత్రమే వైద్యుడిని సంప్రదిస్తారని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ముఖంపై ఈ 5 లక్షణాలు కనిపిస్తే డేంజర్.. మీ కిడ్నీలు షెడ్డుకెళ్లడానికి రెడీగా ఉన్నట్లే..
Kidney Failure Symptoms
Shaik Madar Saheb
|

Updated on: May 03, 2025 | 11:16 AM

Share

ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో కిడ్నీ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నాయి.. శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి.. ఇవి ఎన్నో విధులను నిర్వహిస్తాయి.. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో ముఖ్యమైన పనిని నిర్వహిస్తాయి. ఇవి దెబ్బతిన్నప్పుడు, అది మొత్తం శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దురదృష్టవశాత్తు, చాలా మంది మూత్రపిండ వైఫల్యం విషయంలో.. చివరి దశలో ఉన్నప్పుడు మాత్రమే వైద్యుడిని సంప్రదిస్తారు.. కిడ్నీల వైఫల్యంపై అవగాహన.. సమాచారం లేకపోవడం వల్ల, చాలా మంది ప్రారంభ లక్షణాలను విస్మరిస్తారు. అయితే, కిడ్నీ ఫెయిల్యూర్ కి ముందు ముఖం మీద 5 లక్షణాలు కనిపిస్తాయని.. వాటిని ఎప్పుడూ విస్మరించవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు ఇవే..

ముఖం వాపు: మూత్రపిండాల వైఫల్యం ముఖం వాపునకు కారణమవుతుంది.. దీని వలన ముఖం పెద్దదిగా కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని విస్మరించవద్దు, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

కళ్ళ చుట్టూ వాపు: కళ్ళ చుట్టూ వాపు తరచుగా అలసటకు సంకేతంగా భావిస్తారు. అయితే, ఇది మూత్రపిండాల దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. మూత్రపిండాలు విషాన్ని ఫిల్టర్ చేయలేనప్పుడు, ప్రోటీన్ కణాలు రక్తంలో పేరుకుపోయి, కళ్ళ చుట్టూ వాపునకు కారణమవుతాయి. కళ్ల చుట్టూ ఉబ్బి కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

చర్మం రంగు మారడం: చర్మం పసుపు లేదా నల్లగా మారడం మూత్రపిండాల నష్టానికి సూచిక కావచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

పొడి చర్మం: మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరం ఎలక్ట్రోలైట్ సమతుల్యత చెదిరిపోతుంది.. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారిపోతుంది. ఎటువంటి కారణం లేకుండా మీ చర్మం పొడిగా మారితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

దురద: మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల తరచుగా చర్మం పొడిబారి, దురదకు దారితీస్తుంది. దీర్ఘకాలిక దురదను విస్మరించవద్దు.. ఈ విషయంలో వైద్య సలహా తీసుకోండి.

ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తే.. వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని.. ఆలస్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..