Neem Leaf Benefits: ఖాళీ కడుపుతో వేప ఆకులు తినండి చాలు.. ఆ వ్యాధులు దూరమవుతాయి..
సహజ సిద్ధంగా దొరికే వాటిని తీసుకుంటే శరీరానికి ఎంతో మంచిది. ఇలా సహజ సిద్ధంగా లంభించేది వేప.. దీనిని ఆయుర్వేద నిధిగా భావిస్తారు. దీని ఆకులు, కాండం, పండ్లు, పువ్వులు(Flowers) అన్ని ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి...
సహజ సిద్ధంగా దొరికే వాటిని తీసుకుంటే శరీరానికి ఎంతో మంచిది. ఇలా సహజ సిద్ధంగా లంభించేది వేప.. దీనిని ఆయుర్వేద నిధిగా భావిస్తారు. దీని ఆకులు, కాండం, పండ్లు, పువ్వులు(Flowers) అన్ని ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వేపలో అనేక ఔషధ గుణాలున్నాయి. వేప ఆకులను(Neem Leaves) ఖాళీ కడుపుతో తీసుకుంటే అనేక రోగాలకు చెక్ పెట్టొచ్చు. రోజూ ఉదయాన్నే 5 నుంచి 6 వేప ఆకులను నమిలితే.. చాల ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో వేప ఆకులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. రక్త సమస్యతో బాధపడేవారు వేపతో తమ దినచర్యను ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల రక్తహీనత (Anemia) సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రక్తం కొరతను తీర్చడంలో వేప ఆకులు మీకు బాగా ఉపయోగపడతాయి.
చర్మంలో సహజమైన మెరుపును పెంచడంలో వేప ఆకులు చాలా బాగా సహాయపడుతాయి. ఖాళీ కడుపుతో వేప ఆకులను కడిగి నమలండి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి. నేటి కాలంలో బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో ఖాళీ కడుపుతో వేప ఆకులను తినండి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ తదితర గుణాలు కనిపిస్తాయి. వీటి వల్ల శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్‌ల నుంచి బారి నుంచి రక్షించుకోవచ్చు. వేప ఆకులు నమలడం వల్ల షుగర్ ఉన్న వారికి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది కూడా.
Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
Read Also.. ICMR Report: 60 శాతం మంది భారతీయులకు మధుమేహం నియంత్రణలో లేదు: ఐసీఎంఆర్ అధ్యయనంలో కీలక విషయాలు