Health Tips: ఆ సమస్య బారిన పడుతోన్న యువతులు.. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా.. అసలు కారణం ఇదేనంటోన్న డాక్టర్లు..

|

May 16, 2022 | 6:25 PM

ఈ రోజుల్లో 13 నుంచి 19 సంవత్సరాల బాలికలలో పీసీఓఎస్ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. ఈ వయసులో అధిక..

Health Tips: ఆ సమస్య బారిన పడుతోన్న యువతులు.. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా.. అసలు కారణం ఇదేనంటోన్న డాక్టర్లు..
Pcos Problem
Follow us on

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది భారతీయ మహిళల్లో(Women’s) ఒక సాధారణ వ్యాధిగా మారుతోంది. గణాంకాల ప్రకారం, దేశంలోని ప్రతి ఐదుగురు యువతులలో ఒకరు దీని బారిన పడుతున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు, కూర్చునే అలవాట్లతోపాటు ఈ వ్యాధి హెచ్చరిక లక్షణాలను విస్మరించడం వల్ల, పీసీఓఎస్ ప్రమాదం మరింత పెరుగుతుందని డాక్టర్లు భావిస్తున్నారు.

Also Read: Vitamin D: ‘విటమిన్ డి’ అధికంగా తీసుకుంటున్నారా.. అయితే ఈ వ్యాధుల బారిన పడినట్లే..

టీనేజ్ బాలికలలో PCOS ప్రమాదం..

ఈ రోజుల్లో 13 నుంచి 19 సంవత్సరాల బాలికలలో పీసీఓఎస్ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. ఈ వయసులో అధిక బరువు పెరగడం వల్ల ఇలా జరుగుతోందంట. AIIMS పరిశోధన ప్రకారం, PCOS బారిన పడిన 60% కేసులలో ఎక్కువమంది ఊబకాయంతో బాధపడుతున్నారని తేలింది.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో UK అధ్యయనం ప్రకారం PCOSతో బాధపడుతున్న 24% మంది మహిళల తల్లులు, 32% మంది మహిళల సోదరీమణులు కూడా ఈ వ్యాధిని కలిగి ఉన్నట్లు తేలింది. అంటే పీసీఓఎస్ జెనెటిక్ సిండ్రోమ్ కూడా కావచ్చని తెలుస్తోంది.

ఎయిమ్స్ డాక్టర్ల ప్రకారం.. గ్రామాల్లో కంటే నగరాల్లో నివసించే అమ్మాయిలు అధికంగా PCOS బారిన పడుతున్నారు. దీనికి కారణాలు రెస్టారెంట్లు, కేఫ్‌ల నుంచి బయట ఫుడ్ తినడం, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన ఆహారం, అసంపూర్ణ నిద్ర, భావోద్వేగ ఒత్తిడి, అతితక్కువ వ్యాయామాలతో ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తేలింది.

PCOS ఈ లక్షణాల పట్ల జాగ్రత్త వహిస్తే బెటర్..

మోటిమలు అధికమవడం

అధికంగా జుట్టు పెరగడం

నిరాశ

గుండె వ్యాధులు

వంధ్యత్వం

మధుమేహం

హైపర్ టెన్షన్

క్యాన్సర్

త్వరగా పీరియడ్స్ వచ్చే అమ్మాయిలకు జీవితంలో ఏదో ఒక సమయంలో PCOS వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టీనేజ్ బాలికలలో PCOS కారణాలు..

PCOSకి అతి పెద్ద కారణం హార్మోన్ల సమతుల్యత క్షీణించడం అని డాక్టర్లు అంటున్నారు. కొంతమంది అమ్మాయిల్లో మగ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీని కారణంగా కొన్ని రసాయనాలు శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంటాయి. ఊబకాయం PCOSకి రెండవ ప్రధాన కారణంగా నిలుస్తోంది. యుక్తవయస్సులో స్థూలకాయం బారిన పడడం అనేక సమస్యలకు మూలంగా మారుతుంది.

PCOS నుంచి ఎలా రక్షించుకోవాలి?

PCOSకి ప్రస్తుతం శాశ్వత నివారణ లేదు. ఆహారంలో మార్పులు చేయడం, వ్యాయామం చేయడం, కొన్ని మందుల సహాయంతో దీని లక్షణాలను నియంత్రించవచ్చు. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ జీవితంలో సానుకూల మార్పును తీసుకురావచ్చు.

ప్రతిరోజూ 30 నిమిషాల నడక ముఖ్యం.

బరువుపై శ్రద్ధ వహించాలి.

ఊబకాయం నివారించడం.

ఆహారం నుంచి ఫాస్ట్ ఫుడ్‌ను తొలగించండి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం అంటే పండ్లు, తాజా ఆకుపచ్చ కూరగాయలను తినండి.

ఏదైనా అసాధారణ లక్షణాలను విస్మరించవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. తద్వారా భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న చిట్కాలు, వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే అందించా. నివారణ చర్యలు / చికిత్సను అనుసరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Vitamin D: ‘విటమిన్ డి’ అధికంగా తీసుకుంటున్నారా.. అయితే ఈ వ్యాధుల బారిన పడినట్లే..

Health Care: ఈ పదార్థాలు తినగానే అలర్జీలు అవుతున్నాయా..? జాగ్రత్త..