Gold Rates Today: తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే..
కరోనా నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం తగ్గాయి. ఈరోజు ఉదయం బంగారం ధరలు రూ.2వేలు తగ్గి 10

కరోనా నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం తగ్గాయి. ఈరోజు ఉదయం బంగారం ధరలు రూ.2వేలు తగ్గి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,818కు చేరింది. ఇక శనివారం సాయంత్రం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,460కు చేరింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు.. చెన్మై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,000ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51.270కు చేరింది. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,460కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.49,460 దగ్గర ఉంది. అటు హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రామల 22 క్యారెట్ల బంగారం ధర 46,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,500కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,500కు చేరింది.