మరోసారి భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న అక్కినేని ఫ్యామిలీ.. కథను సిద్ధం చేసే పనిలో విక్రమ్ కుమార్…

మనం సినిమాతో అక్కినేని కుటుంబానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు దర్శకుడు విక్రమ్ కుమార్. అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలను కలిపి ఈ సినిమాలో చూపించాడు.

  • Rajeev Rayala
  • Publish Date - 1:09 pm, Wed, 27 January 21
మరోసారి భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న అక్కినేని ఫ్యామిలీ.. కథను సిద్ధం చేసే పనిలో విక్రమ్ కుమార్...

Vikram Kumar : ‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు దర్శకుడు విక్రమ్ కుమార్. అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలను కలిపి ఈ సినిమాలో చూపించాడు. పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి చిత్రం ఇదే అయ్యింది. ఈ సినిమా తర్వాత అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో ‘హలో’ అనే సినిమా చేసాడు విక్రమ్ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. చివరగా నాని హీరోగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్రమ్ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

తాజాగా మరోసారి భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడట విక్రమ్ . ఈ మేరకు ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. నాగార్జున – నాగ చైతన్య – అఖిల్ – సమంత – అమల – సుమంత్ – సుశాంత్ ఇలా అక్కినేని ఫ్యామిలీ నటీనటులందరితో ఓ భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట విక్రమ్. అక్కినేని హీరోలందరితో ఓ ఫ్యామిలీ సినిమా తీయాలని నాగార్జున విక్రమ్ ను కోరాడట. అయితే అందుకు తగ్గ కథను దర్శకుడు దశరద్ సిద్ధం చేసాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమానుపట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. మరో వైపు విక్రమ్ చైతన్యతో ‘థాంక్యూ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

మరిన్ని ఇక్కడ చదవండి :

Krithi Shetty : కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిన ముద్దుగుమ్మ.. కృతిశెట్టి కోసం క్యూ కడుతున్న ఆఫర్లు