ప్రిన్స్‌తో.. రాములమ్మ ఓకేనా..?

80, 90లలో టాప్ హీరోలకు ధీటుగా నటించి లేడి అమితాబ్‌గా పేరొందిన విజయశాంతి.. 13సంవత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. అప్పటి నుంచి ఆమె రాజకీయాలలో బిజీగా మారిపోయింది. అయితే అప్పటి హీరోయిన్లు ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూ.. మరోవైపు ఇప్పటికీ సినిమాలు చేస్తుండగా విజయశాంతి మాత్రం ఇటు సైడ్ కూడా చూడలేదు. ఆమెను వెండితెరపైకి రీ ఎంట్రీ ఇప్పించాలని చాలామంది దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవన్నీ విఫలమయ్యాయి. అయితే ఇన్నేళ్ల తరువాత రాములమ్మను మళ్లీ వెండితెర మీద […]

ప్రిన్స్‌తో.. రాములమ్మ ఓకేనా..?
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2019 | 12:27 PM

80, 90లలో టాప్ హీరోలకు ధీటుగా నటించి లేడి అమితాబ్‌గా పేరొందిన విజయశాంతి.. 13సంవత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. అప్పటి నుంచి ఆమె రాజకీయాలలో బిజీగా మారిపోయింది. అయితే అప్పటి హీరోయిన్లు ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూ.. మరోవైపు ఇప్పటికీ సినిమాలు చేస్తుండగా విజయశాంతి మాత్రం ఇటు సైడ్ కూడా చూడలేదు. ఆమెను వెండితెరపైకి రీ ఎంట్రీ ఇప్పించాలని చాలామంది దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవన్నీ విఫలమయ్యాయి. అయితే ఇన్నేళ్ల తరువాత రాములమ్మను మళ్లీ వెండితెర మీద మెరిపించేందుకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఒప్పించాడట.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ మూవీలో కీలక పాత్రలో నటించేందుకు విజయశాంతిని అనిల్ కన్విన్స్ చేశాడని సమాచారం. పాత్ర ప్రాధాన్యత.. కాంబినేషన్ సీన్స్ గురించి ఆయన వివరించిన తీరుకు ఇంప్రెస్ అయిన రాములమ్మ.. ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..