Vijay Sethupathi: మరోసారి మంచి మనసు చాటుకున్న మక్కల్‌ సెల్వన్‌ .. సైలెంట్‌గా లక్షల మందికి పైగా..

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో అశేష అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi). డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోన్న ఈ స్టార్‌ హీరో ప్రస్తుతం నేరుగా తెలుగు సినిమాలు కూడా చేస్తున్నాడు.

Vijay Sethupathi: మరోసారి మంచి మనసు చాటుకున్న మక్కల్‌ సెల్వన్‌ .. సైలెంట్‌గా లక్షల మందికి పైగా..
Vijay Sethupathi

Edited By:

Updated on: Mar 25, 2022 | 9:58 AM

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో అశేష అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi). డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోన్న ఈ స్టార్‌ హీరో ప్రస్తుతం నేరుగా తెలుగు సినిమాలు కూడా చేస్తున్నాడు. అభిమానులు ముద్దుగా మక్కల్‌ సెల్వన్‌ అని పిలుచుకునే సేతుపతికి సేవాభావం ఎక్కువే. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ఆప్పన్న హస్తం అందించడంలో విజయ్‌ ముందుంటారు. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. పాండిచ్చేరి వేదికగా ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోన్న వీరరాఘవన్‌ ఇటీవల సేతుపతి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మక్కల్‌ సెల్వన్‌ సహాయ సహకారాలతోనే తాను లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (Employment) కల్పించానని చెప్పుకొచ్చాడు.

‘నేను 2016 నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాను. 2019లో సన్‌ టీవీ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంద్వారా విజయ్‌ సేతుపతిని కలుసుకునే అవకాశం కలిగింది. నా గురించి చెప్పగా వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఉద్యోగాల కల్పన కోసం ఆయనే నాతో పాండిచ్చేరిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు. విజయ్ సార్‌ అందించిన సహాయ సహకారాలతోనే ఇప్పటి వరకు పాండిచ్చేరి, తమిళనాడుకు చెందిన సుమారు లక్షకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. అయితే ఎక్కడా తాను చేసిన సాయం గురించి సేతుపతి చెప్పుకోలేదు’ అని వీరరాఘవన్‌ చెప్పుకొచ్చారు. కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విజయ్‌ సేతుపతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్‌ నటించిన కాతువాకుల రెండు కాదల్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో పాటు కమల్‌ హాసన్‌ విక్రమ్‌, కత్రినాతో మేరీ క్రిస్ట్‌మస్‌ తదితర సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

Also Read:Weekend Special Recipe: మీకు టేస్టీ, స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తే.. శెనగ పిండితో ఇలా చేయండి..

BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 63 ట్రైనీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు..

Boat Airdopes 411: బోట్‌ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. తక్కువ ధరల్లోనే లభ్యం