Samantha strong counter: మీ పని మీరు చూసుకోండి అంటూ.. వాళ్లకు సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌..! సామ్‌ లేటెస్ట్‌ పోస్ట్‌

Samantha strong counter: మీ పని మీరు చూసుకోండి అంటూ.. వాళ్లకు సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌..! సామ్‌ లేటెస్ట్‌ పోస్ట్‌

Anil kumar poka

|

Updated on: Mar 25, 2022 | 9:52 AM

స్టార్‌ హీరోయిన్‌ సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటారు.. ఓవైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు బ్రాండ్స్‏కు ప్రమోటింగ్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా సామ్ డ్రెస్సింగ్ పై ట్రోలింగ్ జరుగుతుంది.


స్టార్‌ హీరోయిన్‌ సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటారు.. ఓవైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు బ్రాండ్స్‏కు ప్రమోటింగ్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా సామ్ డ్రెస్సింగ్ పై ట్రోలింగ్ జరుగుతుంది. విడాకుల ప్రకటన తర్వాత సామ్ షేర్ చేసే ప్రతి పోస్ట్ పై నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేసే ఫోటోషూట్స్.. సినిమాల గురించి ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల సామ్ చేసిన ఫోటోషూట్ పెద్ద చర్చకే దారి తీసింది. గ్రీన్ గౌన్‏లో సామ్ చేసిన ఫోటోషూట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. మితిమీరిన అందాల ప్రదర్శన ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై ఘాటుగానే స్పందించారు సామ్‌.తన ఫోటోస్ షేర్ చేస్తూ.. ఒక మహిళగా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఎంటో నాకు తెలుసు. మహిళలు ధరించే దుస్తులు… వారి మతం.. చదువు.. సామాజిక స్థితి.. రూపురేఖలు.. చర్మం రంగు.. ద్వారా వారిపై కామెంట్స్ చేస్తుంటారు. ఇది ఇలాగే కొనసాగుతుంది. ఒక వ్యక్తి ధరించే బట్టల ఆధారంగా వారిని జడ్జ్ చేయడమనేది చాలా సులభమైన పని. ప్రస్తుతం మనం 2022లో ఉన్నాము. ఇప్పటికీ మహిళ అలంకరణ ..డ్రెస్సింగ్ గురించి జడ్జ్ చేయడం ఆపరా ? ఎదుటివారు ఏం చేస్తున్నారు.. ఎలా ఉంటున్నారు అనేది ఆలోచించడం పక్కన పెట్టి.. ముందు మనపై మనం దృష్టి పెట్టడం మంచిది?.. అంటూ సమంత సుధీర్ఘ పోస్ట్ చేసారు. అయితే విడాకుల తర్వాత సమంత వేసుకునే డ్రెస్సింగ్ పై ప్రతిసారి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పట్ల కొంత బాధపడినా… నెటిజన్ల విపరీత ధోరణికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత యశోద సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..

Titanic ship Tour Viral: సముద్రంలో టైటినిక్‌ షిప్‌ను చూడొచ్చు.. తెగ ఆసక్తి చూపుతున్న జనం.! వైరల్ అవుతున్న వీడియో.

Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..

Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)

anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)