Vijay Deverakonda: విజయ్‌ బాధ్యతలు తీసుకున్న బాలీవుడ్ నిర్మాత.. ఏం చేస్తారో..!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు ఇప్పుడు కాస్త గడ్డుకాలం నడుస్తోంది. 2018లో టాక్సీవాలాతో హిట్ కొట్టిన విజయ్.. గతేడాది డియర్ కామ్రేడ్‌తో, ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్‌తో వరుసగా రెండు ఫ్లాప్‌లను ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఫైటర్‌పైనే తన

Vijay Deverakonda: విజయ్‌ బాధ్యతలు తీసుకున్న బాలీవుడ్ నిర్మాత.. ఏం చేస్తారో..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 24, 2020 | 7:08 PM

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు ఇప్పుడు కాస్త గడ్డుకాలం నడుస్తోంది. 2018లో టాక్సీవాలాతో హిట్ కొట్టిన విజయ్.. గతేడాది డియర్ కామ్రేడ్‌తో, ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్‌తో వరుసగా రెండు ఫ్లాప్‌లను ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఫైటర్‌పైనే తన ఆశలను పెట్టుకున్నారు విజయ్. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు విజయ్. ఇందుకోసం బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్ బాధ్యతలను కరణ్ జోహార్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్‌ నేపథ్యంలో విజయ్‌కు కరణ్ కండిషన్లు పెడుతున్నారట. తనకు చెప్పకుండా తదుపరి చిత్రానికి ఓకే చెప్పకూడదని కరణ్.. విజయ్‌కు సూచించారట. ఈ క్రమంలో విజయ్ కూడా ఓకే చెప్పేసి.. తన కెరీర్ బాధ్యతలను కరణ్‌కు అప్పగించారట. అంతేకాదు ఆ మధ్యన కేవలం షూటింగ్ కోసం మాత్రమే ముంబయి వెళ్లే విజయ్.. ఇప్పుడు ఎక్కువగా అక్కడకు వెళుతున్నాడని, తన సినిమాల గురించి కరణ్‌తో చర్చిస్తున్నారని తెలుస్తోంది. అయితే బాలీవుడ్‌లో పలువురి స్టార్ నటుల వారసుల బాధ్యతలను కరణ్ జోహార్ తీసుకున్న విషయం తెలిసిందే. వారి వారి కెరీర్ ఇప్పుడు పెద్దగా ఏం లేకపోగా.. మరి విజయ్‌ కెరీర్‌ను కరణ్ ఏం చేస్తారోనని ఫిలింనగర్‌లో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.