Liger Movie: విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘లైగర్’ రిలీజ్ డేట్‌పై రేపే అప్‌డేట్
Vijay Devarakonda Liger Movie: సెన్సెషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే..
Vijay Devarakonda Liger Movie: సెన్సెషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. యాక్షన్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ ఫైటర్‌గా నటించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి బుధవారం మూవీ మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.
కొద్ది రోజుల క్రితం చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మూవీమేకర్స్.. రేపు ఉదయం 8:14 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కరణ్ జోహార్, ఛార్మి, అనన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: