Propose Day 2021: స్టార్ హీరోకు వినుత్నంగా లవ్ ప్రపోజ్ చేసిన అభిమాని.. స్వీట్ రిప్లై ఇచ్చిన మాధవన్..
సెలబ్రెటీలకు అభిమానులు తమ ప్రేమను రకారకాలుగా వ్యక్తం చేస్తుంటారు. హీరోహీరోయిన్లు పై ప్రేమిస్తూ.. వారిమీద తమకున్న ప్రేమను అనేక రకాలుగా చూపిస్తుంటారు.
R Madhavan: సెలబ్రెటీలకు అభిమానులు తమ ప్రేమను రకారకాలుగా వ్యక్తం చేస్తుంటారు. హీరోహీరోయిన్లు పై ప్రేమిస్తూ.. వారిమీద తమకున్న ప్రేమను అనేక రకాలుగా చూపిస్తుంటారు. అంతేకాకుండా నటీనటులకు సోషల్ మీడియాలో ఎన్నో లవ్ ప్రసోజల్స్ వస్తుంటాయి. ఇక మాధవన్ లాంటీ హీరోలకు వచ్చే లవ్ ప్రపోజల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ప్రపోజ్ డే సందర్భంగా తమిళ స్టార్ మాధవన్‌కు ఓ అభిమాని లవ్ ప్రపోజ్ చేసింది.
ప్రపోజ్ డే సందర్భంగా పూజా అనే అమ్మాయి.. హీరో మాధవన్‌ను తన ప్రేమను వినుత్నంగా వ్యక్తం చేసింది. “ప్రపంచంలో 8 గ్రాహాలు, 204 దేశాలు, 7 సముద్రాలు, 7,707 ద్వీపాలు, 7.8 బిలియన్ ప్రజలు ఉన్నారు. నేను మరణించేవరకు మిమ్మల్ని ప్రేమిస్తా. దయచేసి నా ప్రేమను అంగీకరించండి. మీరే నా జీవితం. నా ప్రపంచం. నా సౌర వ్యవస్థ. నాకు అన్ని మీరే” అంటూ తన ప్రేమను తెలిపింది. ఇక అభిమాని లవ్ ప్రపోజల్‌కు మాధవన్ స్పందించాడు. “:నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి. మీ ప్రేమకు నా కృతజ్ఞతలు” అని రీట్వీట్ చేశారు. తమిళ స్టార్ హీరో మాధవన్ తెలుగు, హిందీ ఇలా ఏడు భాషల్లో సినిమాలు చేశారు. తెలుగులో నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి, నిశ్శబ్దం సినిమాల్లో ప్రతినాయుకుడిగా నటించారు. అటు నటుడిగానే కాకుండా మాధవన్ నిర్మాతగా, దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ హీరో ‘రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో విడుదల కానుంది.
Haan .. haaan … and Aur ek Haan. ??????❤️❤️❤️?god bless you… thank you for the love . https://t.co/H2FnJyhV82
— Ranganathan Madhavan (@ActorMadhavan) February 8, 2021
Also Read: