AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Hero Marriage Soon : త్వరలో మెగా ఫ్యామిలీ లో పెళ్లి సందడి.. వేసవి లో పెళ్లి పీటలు ఎక్కనున్న మెగా హీరో?..

మెగా ఫ్యామిలీ లో మళ్ళీ పెళ్లిబాజాలు మ్రోగనున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే మెగా బ్రదర్ తనయ నీహారిక పెళ్లి అంగరంగ వైభంగా చేసిన మెగా ఫ్యామిలీ మరో వివాహ వేడెక్కి రెడీ అవుతుందని తెలుస్తోంది. నీహారిక పెళ్లి తంతు ముగియడంతో నెక్ట్ మెగా ఫ్యామిలిలో ఎవరిదీ పెళ్లి అంటూ..

Mega Hero Marriage Soon : త్వరలో మెగా ఫ్యామిలీ లో పెళ్లి సందడి.. వేసవి లో పెళ్లి పీటలు ఎక్కనున్న మెగా హీరో?..
Surya Kala
|

Updated on: Feb 10, 2021 | 2:15 PM

Share

Mega Hero Marriage Soon : మెగా ఫ్యామిలీ లో మళ్ళీ పెళ్లిబాజాలు మ్రోగనున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే మెగా బ్రదర్ తనయ నీహారిక పెళ్లి అంగరంగ వైభంగా చేసిన మెగా ఫ్యామిలీ మరో వివాహ వేడెక్కి రెడీ అవుతుందని తెలుస్తోంది. నీహారిక పెళ్లి తంతు ముగియడంతో నెక్ట్ మెగా ఫ్యామిలిలో ఎవరిదీ పెళ్లి అంటూ బ్యాచిలర్స్ పై అందరూ దృష్టిసారించారు.. పెళ్ళికావల్సిన మెగా హీరోలు క్యూలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రసాద ల వివాహం గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మెగా ఫ్యామిలీ లో మళ్ళీ పెళ్లి ఎవరిదీ ఎవరి ఇంట్లో పెళ్ళిసందడి మొదలు అవుతుందని అభిమానుల తో సహా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వరాలు మళ్ళీ లైమ్ లోకి వచ్చాయి.

ఇటీవల తేజు ఓ ఇంటర్వ్యూలో తాను సింగిల్‌ అన్న చెప్పాడు.. అయితే తన ఫ్యామిలీ పెళ్లి కోసం ప్లాన్ చేస్తోంది. నిహారిక వివాహం తరువాత ఇప్పుడు పెళ్లిపై కుటుంబం ఒత్తిడి చేస్తోందని చెప్పాడు తేజు. అయితే ఇప్పుడు ఆ మాటలు నిజం కాబోతున్నాయని.. తేజు త్వరలో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి.. పెళ్లి పీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో పుకారు షికారు చేస్తోంది.

ఇప్పటికే మేనల్లుడు కోసం చిరంజీవి తన చెల్లితో కలిసి అమ్మాయిని సెలక్ట్ చేశారని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది మే నెలలో ధరమ్ తేజ్ పెళ్లి జరగబోతుందని సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమేనని, ఆమెకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని ఆ అమ్మాయి మెగా ఫ్యామిలీ కి బాగా పరిచయం ఉన్న అమ్మాయి అని బాగా స్నేహ సంబంధాలు ఉండడంతో తమ ఫ్యామిలీలో కలిసిపోతుందని ఈ అమ్మాయిని సెలక్ట్ చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలన్నీ నిజమా కదా అని తెలియాలంటే మెగా ఫ్యామిలీ ఈ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సిందే.. అధికారంగా ప్రకటన చేసే వరకూ ఆగాల్సిందే..

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వెండి తెరపై అడుగు పెట్టిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ఓ ఫేమ్ తెచ్చుకున్నాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు తేజు.

Also Read:

టీచర్ జాబ్ ని వదిలి వ్యాపారంగలోకి అడుగు.. సరికొత్త ఆలోచనతో.. వరిపొట్టు బిజినెస్ తో లక్షల్లో ఆదాయం

కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో టీచర్ సహా మరొకరి మృతి.. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..