‘హీరో’గా విజయ్ దేవరకొండ.. మూవీ ప్రారంభం

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో విజయ్ నటించనున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు కొరటాల శివ, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. కొరటాల శివ మొదటి షాట్‌కు క్లాప్ […]

  • Updated On - 12:38 pm, Sun, 19 May 19 Edited By:
‘హీరో’గా విజయ్ దేవరకొండ.. మూవీ ప్రారంభం

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో విజయ్ నటించనున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో జరిగాయి.

ఈ కార్యక్రమానికి దర్శకుడు కొరటాల శివ, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. కొరటాల శివ మొదటి షాట్‌కు క్లాప్ కొట్టారు. కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన మాళవిక మోహనన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.