AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వీయ నియంత్రణ మంచిదే.. కానీ..

డిజిటల్ మీడియాలో పెరుగుతున్న అసభ్యత, అశ్లీలత గురించి ప్రతీసారి చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే వాటిని నియంత్రించడానికి మాత్రం మార్గాలు దొరకలేదు. ఇకపోతే డిజిటల్ పెట్రేగిపోవడాన్ని వ్యతిరేకించడం తప్ప దానిని పూర్తిగా నిరోధించే దమ్ము ఎవరికీ లేదనే చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ .. అమెజాన్ ప్రైమ్.. హాట్ స్టార్.. ఈరోస్…  ఇలా ఎన్నో అంతర్జాతీయ స్థాయి డిజిటల్ దిగ్గజాలు నిరంతరం హాట్ హాట్ కంటెంట్ ను డిజిటల్ లో వండి వార్చుతున్నాయి. ఇక ఆ వంటకం మీద […]

స్వీయ నియంత్రణ మంచిదే.. కానీ..
Ravi Kiran
| Edited By: |

Updated on: May 19, 2019 | 2:00 PM

Share

డిజిటల్ మీడియాలో పెరుగుతున్న అసభ్యత, అశ్లీలత గురించి ప్రతీసారి చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే వాటిని నియంత్రించడానికి మాత్రం మార్గాలు దొరకలేదు. ఇకపోతే డిజిటల్ పెట్రేగిపోవడాన్ని వ్యతిరేకించడం తప్ప దానిని పూర్తిగా నిరోధించే దమ్ము ఎవరికీ లేదనే చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ .. అమెజాన్ ప్రైమ్.. హాట్ స్టార్.. ఈరోస్…  ఇలా ఎన్నో అంతర్జాతీయ స్థాయి డిజిటల్ దిగ్గజాలు నిరంతరం హాట్ హాట్ కంటెంట్ ను డిజిటల్ లో వండి వార్చుతున్నాయి. ఇక ఆ వంటకం మీద మోజు యూత్ లో అంతకంతకు పెరిగిపోతోంది.

డిజిటల్ లో అసభ్యత.. అశ్లీలతపై నియంత్రణ ఏది? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే వాటిపై పర్యవేక్షణ- నియంత్రణ రెండిటినీ బ్యాలెన్స్ చేయాలని బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ అభిప్రాయపడ్డారు. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ పై నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్ స్ట్రీమింగ్ కి సెన్సార్ అవసరమని తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఏక్తా తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. నెట్ ఫ్లిక్స్ తరహాలోనే ఆన్లైన్ లో సినిమాలు అందించేందుకు ఆల్ట్ బాలాజీ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏక్తా ఓ మీడియా సమావేశంలో పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

డిజిటల్ లో కంటెంట్ హద్దు మీరుతున్న మాట వాస్తవమే.. కానీ అలా అని అడల్ట్ కంటెంట్ ని నిషేధించమనడం సరికాదు. ప్రతిచోటా మంచి చెడు ఉంటాయి. ఇక్కడా మంచి- చెడు రెండూ ఉన్నాయి. అసభ్య అశ్లీల అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో నటించే వాళ్లకు లేని ఇబ్బంది.. వాటిని చూసే వాళ్లకు లేని ఇబ్బంది సెన్సార్ కి ఎందుకు అని ఆమె ప్రశ్నించింది. నిషేధం వద్దు.. నియమాలు అవసరం.. చట్టబద్దంగా ఉండే పెళ్లిలో కూడా నేరాలు జరగడం లేదా? నేరాలకు సెక్స్ కారణం కాదని  ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పును గౌరవిస్తూనే నియంత్రణను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. తాను బోల్డ్ గా ఉంటానని..సెక్స్ అనే దానితో తనకు ఎలాంటి సమస్య లేదని ఏక్తా కపూర్ మరో సంచలన వ్యాఖ్యతో వేడి రాజేశారు.