జవాన్ కుటుంబాలకు విజయ్ ఆర్థిక సాయం

జవాన్ కుటుంబాలకు విజయ్ ఆర్థిక సాయం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఈ ఘటనపై సానుభూతిని తెలుపుతున్నారు. ఈ చర్యకు ప్రతీకారం తీర్చుకోవాల్సి అంటే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకేశాడు హీరో విజయ్ దేవరకొండ. మరణించిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడం కోసం తనవంతు సాయాన్ని చేశాడు. They protect our families. We must stand by the families of our soldiers. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 16, 2019 | 10:36 AM

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఈ ఘటనపై సానుభూతిని తెలుపుతున్నారు. ఈ చర్యకు ప్రతీకారం తీర్చుకోవాల్సి అంటే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకేశాడు హీరో విజయ్ దేవరకొండ. మరణించిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడం కోసం తనవంతు సాయాన్ని చేశాడు.

దీనికి సంబంధించిన ఓ సర్టిఫికేట్‌లో సోషల్ మీడియలో షేర్ చేసిన విజయ్.. ‘‘మన కుటుంబాలను వారు కాపాడుతున్నారు. మన జవాన్ల కుటుంబాలకు మనం అండగా నిలవడాల్సిన అవసరం ఉంది. వారి జీవితాలకు వెల కట్టలేము. కానీ మనం ఎంతో కొంత చేయాలి. నా తరపున నేను సాయం చేశా. మనమందరం కలిసి సాయం చేద్దాం. వారికి ఓ పెద్ద సపోర్ట్‌ను క్రియేట్ చేద్దాం’’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోసారి విజయ్ తన గొప్ప మనసు చాటుకున్నాడు అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. కాగా మరోవైపు కోలీవుడ్ నటుడు సూర్య కూడా జవాన్లకు సాయం చేద్దాం అంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu