AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : నేను హీరోగా చేసిన సినిమాలో చిరంజీవి విలన్.. అప్పుడే అనుకున్నా.. టాలీవుడ్ నటుడు..

సీనియర్ నటుడు నరసింహరాజు ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, గత వివాదాలు, మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్వభావం కలిగిన వ్యక్తిని అని, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన అంగీకరించారు. ఏఎన్నార్‌తో మూడు సినిమాలు చేశానని, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ తనను ఆప్యాయంగా పలకరించారని గుర్తుచేసుకున్నారు.

Tollywood : నేను హీరోగా చేసిన సినిమాలో చిరంజీవి విలన్.. అప్పుడే అనుకున్నా.. టాలీవుడ్ నటుడు..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2026 | 9:50 AM

Share

సీనియర్ నటుడు నరసింహరాజు ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వివాదాలు, మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదల, కెనడాలో తన జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, నరసింహరాజు తన స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్వభావం వల్ల ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని అంగీకరించారు. పత్రికలలో తన గురించి “నోటి దురుసు” కారణంగా ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను మాటలు అన్నారని వచ్చిందని, దానివల్ల ఆఫర్లు తగ్గి, ఇండస్ట్రీ దూరంగా పెట్టిందని వచ్చిన కథనాలను ఆయన వివరించారు. అయితే, అవి కేవలం యువకుడిగా తెలియక, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన మాటలని, పత్రికలు వాటిని ఎక్కువగా రాశాయని అన్నారు. “అవి అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం అంత ఇది కాదు” అని పేర్కొన్నారు. ఈ వివాదాల వల్ల తనకు పెద్దగా నష్టం జరగలేదని, ఏఎన్నార్‌తో ఆ తర్వాత మూడు సినిమాలు చేశానని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పది మంది మంత్రుల పక్కన ఉన్నా, తనను ప్రత్యేకంగా కలుసుకుని, ఆప్యాయంగా పలకరించి, సహాయం కావాలా అని అడిగారని తెలిపారు. “నేను చూడటానికి వచ్చాను సార్, సహాయం కావాలని కాదు. సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లి సీఎం అయ్యారంటే ఆనందంతో చూడటానికి వచ్చాను” అని తాను చెప్పినట్లు నరసింహరాజు వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

అప్పట్లో తాను నటించిన జగన్మోహిని చిత్రం సింహబలుడు, కృష్ణ గారి సింహగర్జన వంటి పెద్ద చిత్రాలతో పోలిస్తే పెద్ద విజయం సాధించిందని నరసింహరాజు పేర్కొన్నారు. జగన్మోహినిలో హీరోయిన్ జయమాలిని చాలా అందంగా ఉండేవారని, ఆమెకు ఆ సినిమాతో మంచి మార్కెట్ వచ్చిందని తెలిపారు. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ, స్మిత వంటి నటీమణులకు అప్పట్లో అభిమాన గణం ఎక్కువగా ఉండేదని, వారిని నిలబెట్టుకున్నవారు బాగా రాణించారని చెప్పారు. శోభన్ బాబు గారి లాగా జయమాలిని కూడా బాగా సంపాదించి, వెల్ సెటిల్డ్ అయి, వద్దు అనుకున్నప్పుడు మానేశారని ప్రశంసించారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

పున్నమి నాగు సినిమాలో చిరంజీవి విలన్‌గా నటించగా, తాను హీరోగా చేసిన విషయాన్ని నరసింహరాజు గుర్తుచేసుకున్నారు. “ఈరోజు అదే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇండస్ట్రీకి బాప్, సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఎవరు అంటే ఎవరైనా గానీ ఇంక నో డౌట్ చిరంజీవి అనే పేరు ఒక్కటే చెప్తారు” అని వ్యాఖ్యానించారు. చిరంజీవి ఎదుగుదల పట్ల తనకు ఎలాంటి అసూయ లేదని, తన పక్కన ఉన్నవారు ఎవరైనా వ్యాపారంలో పెరిగినా, ఆర్టిస్టుగా పెరిగినా, ఏ విషయంలో పెరిగినా తనకు చాలా సంతోషం కలుగుతుందని అన్నారు. “మనకి రేపు ఏదైనా తెలిసిన వాళ్ళు అనుకోండి ఏదైనా కష్టం వస్తే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు” అని పేర్కొన్నారు. చిరంజీవి అంత అవుతారని తెలియకపోయినా, మంచి ఆర్టిస్ట్ అవుతారని, గొప్ప హీరో అవుతారని అప్పట్లోనే తనకు తెలుసని నరసింహరాజు చెప్పారు. పునాదిరాళ్ళు పాటలు వచ్చినప్పుడు చిరంజీవి డాన్స్ చేసేవారని, ఎవరూ చూడటం లేదన్నట్టుగా ఉత్సాహంగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. “కృషి ఆయన కృషితో మంచిగా పైకి వచ్చారు. మంచి వ్యక్తి, కృషితో పాటు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

నరసింహరాజు, చిరంజీవి..

Narasimha Raju, Chiranjeevi

Narasimha Raju, Chiranjeevi

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

Follow Us