AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkaiah Naidu : నిర్మాత దొరస్వామిరాజు మృతి పై సంతాపం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సినీ నిర్మాత,డిస్టిబ్యూటర్  వి.దొరస్వామిరాజు(75) సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన గుండెపోటుతో తుదిశ్వాసవిడిచారు.

Venkaiah Naidu : నిర్మాత దొరస్వామిరాజు మృతి పై సంతాపం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Rajeev Rayala
|

Updated on: Jan 20, 2021 | 5:43 AM

Share

Venkaiah Naidu : సినీ నిర్మాత,డిస్టిబ్యూటర్  వి.దొరస్వామిరాజు(75) సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన గుండెపోటుతో తుదిశ్వాసవిడిచారు. సుదీర్ఘసినీ ప్రయాణంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌గా అజరామరమైన విజయాల్ని అందుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలోని వరదరాజుల కండ్రిగ గ్రామంలో 1946 జూలై 1న దొరస్వామిరాజు జన్మించారు.

మంగళవారం దొరస్వామిరాజు అంత్యక్రియల్ని హైదరాబాద్‌లో నిర్వహించారు కుటుంబసభ్యులు. కాగా ద్వారస్వామి రాజు మృతి పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మాట్లాడుతూ.. ”ప్రముఖ నిర్మాత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ శాసనసభ్యులు వరదరాజు దొరస్వామి మరణ వార్త తెలిసి ఎంతో విచారించాను. పంపిణీదారుడిగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించి అంచెలంచెలుగా నిర్మాతగా ఎదిగిన ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. సినీ నిర్మాతగా విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన దొరస్వామి గారి సినీ ప్రయాణం ఉన్నతమైనది.అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan : క్రిష్ సినిమా షూటింగ్ కు 20 రోజులు బ్రేక్ ఇవ్వనున్న పవన్.. ఈ గ్యాప్ లో..