Ghani Movie Update: వరుణ్ తేజ్ ‘గని’ వచ్చేది అప్పుడే.. అఫీషియల్‏గా ప్రకటించిన చిత్రయూనిట్..

యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'గని'. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా 'గని' సినిమా

Ghani Movie Update: వరుణ్ తేజ్ 'గని' వచ్చేది అప్పుడే.. అఫీషియల్‏గా ప్రకటించిన చిత్రయూనిట్..

యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘గని’. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా ‘గని’ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు యూనిట్ సభ్యులు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి స్పందన లభించింది. అందులో వరుణ్ బాక్సింగ్ రింగ్‍లో పంచులు కొడుతున్నట్లుగా కనిపించాడు వరుణ్. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమాలో వరుణ్ బాక్సార్‏గా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా వరుణ్ తేజ్ ‘గని’ సినిమా జూలై 30న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు కీలక పాత్రలలో నటించనున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయూ మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.