గతేడాది దీపావళికి ‘అన్నా్త్తై (తెలుగులో పెద్దన్న)’ సినిమాతో మంచి మాస్ హిట్ అందుకున్నారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajini Kanth). ఆ తర్వాత అనారోగ్యం, కూతురు ఐశ్వర్య విడాకుల వ్యవహారంతో కొద్దిరోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల తన 169వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘డాక్టర్’ తో సెన్సేషనల్ హిట్ కొట్టి ప్రస్తుతం విజయ్ తో కలిసి ‘బీస్ట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశారు. అయితే దీంతో పాటు తన 170 సినిమాను కూడా రజనీ ఖరారు చేశారని ఇటీవల వార్తలు వినిపించాయి. వలిమై నిర్మాత బోనీకపూర్ (Boney Kapoor) తో ఈ సినిమా చేయనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి అరుణ్ రాజా కామరాజ్ దర్శకుడని కూడా ప్రచారం సాగింది.
అయితే తాజాగా ఈ పుకార్లపై బోనీ కపూర్ స్పందించారు. రజనీతో సినిమా చేస్తున్నారన్న వార్తలను కొట్టి పారేశారు ‘రజనీ గారితో నాకు చాలా ఏళ్ల పాటు స్నేహం ఉంది. మేము తరచుగా కలుసుకుంటాం. ఒకరి ఆలోచనలను మరొకరు షేర్ చేసుకుంటాం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలనుకుంటే దాన్ని అధికారికంగా ప్రకటించే మొదటి వ్యక్తిని నేనే. ఇలాంటి లీకుల గురించి అసలు చర్చే అవసరం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. కాగా అజిత్ కుమార్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ‘వలిమై’ ఈనెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘ఆర్‌ఎక్స్100’ ఫేం కార్తికేయ అజిత్ తో తలపడనున్నాడు.
Rajni Garu has been a friend for years. We meet regularly and keep exchanging ideas. Whenever we finalise a film to work together on, I shall be the first person to announce it. You will not have to get such ‘leaked ideas’.
— Boney Kapoor (@BoneyKapoor) February 20, 2022
Andhra Pradesh: ఉద్యోగుల కొత్త పీఆర్‌సీ అమలు ఉత్తర్వుల విడుదల.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు ఎలా ఉన్నాయంటే..
India Fishermen: బుద్ధి మార్చుకోని పాక్.. 30 మంది భారత జాలర్లను బంధీలుగా చేసుకున్న దాయాది..