Balakrishna Movie Update: బాలయ్య కోసం రంగంలోకి ఇద్దరు విలన్లు.. బోయపాటి ప్లాన్ మాములుగా లేదుగా..

నందమూరి హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా

Balakrishna Movie Update: బాలయ్య కోసం రంగంలోకి ఇద్దరు విలన్లు.. బోయపాటి ప్లాన్ మాములుగా లేదుగా..
Follow us
Rajitha Chanti

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 26, 2021 | 12:57 PM

నందమూరి హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తాజాగా బాలయ్య సినిమాలో ఇద్దరు విలన్లు నటించనున్నట్లుగా తెలుస్తోంది. బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తున్న BB3పై అభిమానులకు అంచనాలు తీవ్ర స్థాయిలో నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్యకు ప్రత్యర్థిగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని ఫిక్స్ చేసినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో మరో విలన్‏గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించనున్నట్లుగా సమాచారం. ఈ భారీ యాక్షన్ సినిమాలో బాలయ్యకు ధీటుగా ఇద్దరు విలన్లను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట బోయపాటి. ప్రస్తుతం సారథి స్టూడియోలో మాస్ సాంగ్‏తోపాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నట్లుగా సమాచారం.

Also Read:

రవితేజ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.. ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. నయా లుక్‏లో అదరగొడుతున్న మాస్ రాజా..