హీరోయిన్ కోసం కొట్టుకున్న బాయ్‌ఫ్రెండ్స్

బెంగళూరు: కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది కోసం ఆమె బాయ్‌ఫ్రెండ్స్ కొట్టుకున్నారు. ఈ ఘటన బెంగళూరులోని రిట్జ్ కార్టన్ హోటల్‌లో చోటు చేసుకున్నది. రాగిణి తన బాయ్‌ఫ్రెండ్ రవిశంకర్‌తో కలిసి హోటల్‌లో డిన్నర్ చేస్తోంది. ఈ సీన్‌ను రాగిణి మాజీ బాయ్ ఫ్రెండ్ శివప్రకాశ్ చూశాడు. అతను అయితే అదే హోటల్‌లో తన దోస్తులతో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చాడు. చూసిన వెంటనే వెళ్లి రాగిణితో గొడవపడ్డాడు. దీంతో రవిశంకర్ కలగజేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవపెరిగి తీవ్రంగా […]

  • Vijay K
  • Publish Date - 1:31 pm, Mon, 18 March 19
హీరోయిన్ కోసం కొట్టుకున్న బాయ్‌ఫ్రెండ్స్

బెంగళూరు: కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది కోసం ఆమె బాయ్‌ఫ్రెండ్స్ కొట్టుకున్నారు. ఈ ఘటన బెంగళూరులోని రిట్జ్ కార్టన్ హోటల్‌లో చోటు చేసుకున్నది. రాగిణి తన బాయ్‌ఫ్రెండ్ రవిశంకర్‌తో కలిసి హోటల్‌లో డిన్నర్ చేస్తోంది. ఈ సీన్‌ను రాగిణి మాజీ బాయ్ ఫ్రెండ్ శివప్రకాశ్ చూశాడు. అతను అయితే అదే హోటల్‌లో తన దోస్తులతో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చాడు.

చూసిన వెంటనే వెళ్లి రాగిణితో గొడవపడ్డాడు. దీంతో రవిశంకర్ కలగజేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవపెరిగి తీవ్రంగా తన్నుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో శివప్రకాశ్ ఆవేశంలో బీర్ బాటిల్‌తో రవిశంకర్‌పై దాడి చేశాడు. దీంతో హోటల్ యాజమాన్యం కలగజేసుకుని సర్ది చెప్పాల్సి వచ్చింది. ఈ గొడవపై రాగిణి, రవిశంకర్ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి శివప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు.