Anurag Thakur: భారత చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు.. వేడుకగా TV9 బంగ్లా ఘోరర్ బయోస్కోప్ అవార్డ్స్ 2023..

|

Jun 17, 2023 | 10:12 PM

TV9 Bangla Ghorer Bioscope Awards 2023: టీవీ9 బంగ్లా ఘోరర్ బయోస్కోప్ అవార్డ్స్ 2023 వేడుక శనివారం అట్టహాసంగా జరిగింది. బెంగాల్ చరిత్రలో ఒక ప్రాంతీయ వార్తా ఛానెల్ ద్వారా చేపట్టిన మొట్టమొదటి అవార్డుల ప్రదానం కార్యక్రమంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసల వర్షం కురిపించారు.

Anurag Thakur: భారత చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు.. వేడుకగా TV9 బంగ్లా ఘోరర్ బయోస్కోప్ అవార్డ్స్ 2023..
Anurag Thakur
Follow us on

TV9 Bangla Ghorer Bioscope Awards 2023: టీవీ9 బంగ్లా ఘోరర్ బయోస్కోప్ అవార్డ్స్ 2023 వేడుక శనివారం అట్టహాసంగా జరిగింది. బెంగాల్ చరిత్రలో ఒక ప్రాంతీయ వార్తా ఛానెల్ ద్వారా చేపట్టిన మొట్టమొదటి అవార్డుల ప్రదానం కార్యక్రమంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసల వర్షం కురిపించారు. TV9 బంగ్లా ఘోరర్ బయోస్కోప్ అవార్డ్స్ 2023 వేడుక బెంగాలీ టెలివిజన్, OTT పరిశ్రమలోని ప్రతిభావంతులు, కళాకారులను సత్కరించడానికి TV9 బంగ్లా ఘోరర్ బయోస్కోప్ అవార్డ్స్ 2023 వేడుకను టీవీ9 బంగ్లా నిర్వహించింది. ఈ గ్రాండ్ అవార్డ్స్ నైట్ వేడుకను TV9 బంగ్లా టెలివిజన్, OTT అవార్డుల మొదటి ఎడిషన్‌లో భాగంగా పలువురికి అందజేసింది. TV9 బంగ్లా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమాచార, ప్రసార & యువత, క్రీడా వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, టీవీ9 నెట్‌వర్క్‌ ఎండీ, సీఈఓ బరున్‌ దాస్‌, బెంగాల్ గవర్నర్, CV ఆనంద బోస్, ఫిర్హాద్ హకీమ్, కోల్‌కతా మేయర్, బ్రత్యా బసు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. టెలివిజన్ కంటెంట్ గతం కంటే ఇప్పుడు చాలా వృద్ధి చెందిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత చిత్ర పరిశ్రమకు ప్రశంసలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ లో ప్రేక్షకులను సౌత్ సినిమాలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కొరియన్ చిత్రాలు, వెబ్ సిరిస్‌లు ఆకట్టుకుంటున్నాయని వివరించారు. బంగ్లా కంటెంట్‌ కూడా అంతర్జాతీయంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇక్కడ చాలామంది సినీ ప్రముఖులు ఉన్నారని.. కొంచెం బాధ్యతతో ప్రొడ్యూసర్‌లు, డైరక్టర్‌లు సమాజాన్ని ఉద్దరించేలా చిత్రాలు అందించాలని సూచించారు.

Tv9 Bangla Awards 2023

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. టీవీ9 నెట్‌వర్క్‌ ఎండీ, సీఈఓ బరున్‌ దాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మొదటిసారి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారని.. వచ్చే ఐదేళ్లలో భారీగా నిర్వహించాలని కోరారు. మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారని.. ఇలాంటి వేడుకలను మరెన్నో నిర్వహించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

Tv9 Bangla Awards

మరిన్ని సినిమా వార్తల కోసం..