త్రిష రెండక్షరాల అందాల తార. సినిమా కెరియర్ లో మొదటి ఇన్నింగ్స్ కంటే కూడా సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇటీవల విడుదలైన లియో సినిమాలో విజయ్ సరసన నటించి మంచి టాక్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 550కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్.. నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మన్సూర్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ‘లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసి నేను కూడా ఈ సినిమాలో నటించా. ఈ సినిమాలో ఒక్క బెడ్‌రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నా. నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను కూడా బెడ్‌రూమ్‌కు తీసుకెళ్తానని భావించా. ఇంతకు ముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ ఈ చిత్రం కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు.’ అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.
The thing about men like Mansoor Ali Khan – they have always been talking like this. Never been condemned, with other men in power, money and influence laughing along; eeyy aamaa da macha correct ra maccha sorta thing. Robo Shankar said something on how he wants allowed to touch… pic.twitter.com/ZkRb2qxmMl
— Chinmayi Sripaada (@Chinmayi) November 18, 2023
ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై లియో సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈయనతోపాటూ ఇతర నటీమణులు కూడా తీవ్రంగా ఖండించారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అతని వ్యాఖ్యలు చూసిన నెటిజన్లు ఇలాంటి వారికి సినిమా అవకాశాలు ఎందుకు ఇస్తారు అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై నటి త్రిష స్పందించారు. ‘ మన్సూర్ అలీఖాన్ లియో సినిమాలో నాతో పాటూ నటించారు. ఆయన నా గురించి అసభ్యకరంగా మాట్లాడినట్లు ఓ వీడియో నా దృష్టికి వచ్చింది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అతను మాట్లాడిన మాటలు స్త్రీని ద్వేషిస్తూ, అగౌరవపరుస్తూ, చెడుగా చూపిస్తున్నట్లు ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తితో కలిసి నటించినందుకు గొప్పగా ఫీలవుతున్నాను. అయితే రానున్న రోజుల్లో ఇతనితో కలిసి నటించేందుకు సిద్దంగా లేను. కలిసి నటించకుండా ఉండేలా చూసుకుంటాను అని ధీటైన సమాధానం ఇచ్చారు. సమాజంలో ఇలాంటి వాళ్ల వల్లే మనుషులకు చెడ్డపేరు వస్తుందని తన ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen…
— Trish (@trishtrashers) November 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..