Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్‌.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రణీత్ అలియాస్ హనుమంతు.. ఇతడిలోని టాలెంట్‌ని గౌరవిస్తూ మనోళ్లు సినిమా ఛాన్సులు కూడా ఇచ్చేశారు. సుధీర్‌బాబు హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ హరోంహరలో బుజ్జులు అనే క్యారెక్టర్‌లో కనిపించాడు ఈ సోషల్ మీడియా సైకో. తమతమ సినిమాల ప్రమోషన్ కోసం హనుమతుకు ఇంటర్వ్యూలిచ్చిన నానీ, కార్తికేయ లాంటి కొందరు హీరోలు ఇప్పుడు పశ్చాత్తాప్పడుతున్నారు.

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్‌.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
P Hanumanthu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 10, 2024 | 6:00 PM

ప్రణీత్ హనుమంతు గత కొద్దిరోజులుగా ఈ పేరు వార్తల్లో తెగ వినిపిస్తుంది. తండ్రి కూతుర్ల బంధంపై నీచమైన కామెంట్స్ చేస్తూ వీడియోలు చేసిన ప్రణీత్ హనుమంతను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ హనుమంతుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్‌ను హాజరు పరిచి పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకు రానున్నారు పోలీసులు. ప్రణీత్‌తో పాటు మరో ముగ్గరురిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు  చేశారు.

ప్రణీత్ అలియాస్ హనుమంతు.. ఇతడిలోని టాలెంట్‌ని గౌరవిస్తూ మనోళ్లు సినిమా ఛాన్సులు కూడా ఇచ్చేశారు. సుధీర్‌బాబు హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ హరోంహరలో బుజ్జులు అనే క్యారెక్టర్‌లో కనిపించాడు ఈ సోషల్ మీడియా సైకో. తమతమ సినిమాల ప్రమోషన్ కోసం హనుమతుకు ఇంటర్వ్యూలిచ్చిన నానీ, కార్తికేయ లాంటి కొందరు హీరోలు ఇప్పుడు పశ్చాత్తాప్పడుతున్నారు. డార్క్‌ కామెడీకి, రోస్ట్ వీడియోలకు కేరాఫ్ ఒక్క ప్రణీత్ హనుమంతుడే కాదు.. సెర్చింజన్‌ని అడగాలే గానీ.. వేలమంది ఫనుమంతులు కనిపిస్తారు.

ఫన్ కోసం వెతకడం, ఆ ఫన్ కోసమే బతకడం, బూతులు తిట్టడం, తిట్టించుకోవడం.. ఇదే ఒక ప్యాషన్‌గా మారిన ఇవాళ్టి యువతకు ఆశ్రయమిచ్చేది సోషల్ మీడియాలోని ఈ డార్క్‌ కామెడీ ఛానళ్లే. ఖరీదైన పేరెంట్స్ ఉండి.. బరువైన పాకెట్‌ మనీ ఎంజాయ్‌ చేసే చిన్నపిల్లలు ఇటువంటి వీడియోలతో వచ్చే చీప్ ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతారు. ఈ బలహీనతే ఫనుమంతులాంటి అరాచకులకు ఆసరా. వీళ్లు కొట్టే లైకులే పెట్టుబడి. అడల్ట్ కంటెంట్ చూడొద్దు, బాడీ షేమింగ్ చెయ్యొద్దు.. మానవ సంబంధాల్ని అవమాన పర్చొద్దు లాంటి మాటలు రుచించనంత స్థాయికి వీళ్లను తీసుకెళ్లాయి డార్క్ కామెడీ వెబ్‌సైట్లు. ఇక ప్రణీత్ హనుమంతు పై చాలా మంది సెలబ్రెటీలు ఫైర్ అయ్యారు. ఇలాంటి నీచులను వదిలిపెట్టకూడదు. కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.