HIT 2: శేష్‌కు షాక్‌ ఇచ్చిన యూట్యూబ్‌.. ఇకపై హిట్‌ 2 టీజర్‌ చూడాలంటే అది తప్పనిసరి

|

Nov 09, 2022 | 4:15 PM

తాజాగా హిట్ 2 టీమ్‌కు యూట్యూబ్‌ షాక్ ఇచ్చింది. టీజ‌ర్‌ ట్రెండింగ్ లిస్టు నుంచి తొల‌గించింది. టీజ‌ర్ చూడ‌టానికి వ‌యోప‌రిమితి ఉండాలంటూ ఆంక్షలు, పరిమితులు విధించింది. అయితే ఈలోపే టీజ‌ర్‌కు 9 మిలియ‌న్ వ్యూస్ రావడం విశేషం.

HIT 2: శేష్‌కు షాక్‌ ఇచ్చిన యూట్యూబ్‌.. ఇకపై హిట్‌ 2 టీజర్‌ చూడాలంటే అది తప్పనిసరి
Adivi Sesh
Follow us on

యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో అడివి శేష్‌ నటించిన తాజా చిత్రం హిట్ 2.. ది సెకెండ్ కేస్‌. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. న్యాచురల్‌ స్టార్‌ నాని సమర్పకుడిగా వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌ నేని ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్లను స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇటీవల టీజర్‌ని విడుదల చేసింది. దీనికి ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. అతి త‌క్కువ సమయంలోనే యూట్యూబ్ స‌హా అన్నీ సోష‌ల్ మీడియా మాధ్యమాల్లోనూ హిట్ 2 టీజ‌ర్ ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే తాజాగా హిట్ 2 టీమ్‌కు యూట్యూబ్‌ షాక్ ఇచ్చింది. టీజ‌ర్‌ ట్రెండింగ్ లిస్టు నుంచి తొల‌గించింది. టీజ‌ర్ చూడ‌టానికి వ‌యోప‌రిమితి ఉండాలంటూ ఆంక్షలు, పరిమితులు విధించింది. అయితే ఈలోపే టీజ‌ర్‌కు 9 మిలియ‌న్ వ్యూస్ రావడం విశేషం. తాజాగా దీనిపై హీరో అడివి శేష్ వివ‌ర‌ణ ఇస్తూ ఓ వీడియోను విడుద‌ల చేశారు.

ట్రెండింగ్‌ లిస్టు నుంచి ఔట్‌..

‘ఇలాంటిది జ‌రుగుతుంద‌ని మా టీం ముందుగానే ఊహించింది. డైరెక్టర్‌ శైలేష్‌ కొలను టీజర్‌ నాకు చూపించగానే ఇలా జరుగుతుందని ముందే అనుకున్నాం. అనుకున్నట్లుగానే జరిగింది. యూట్యూబ్‌ తన ట్రెండింగ్‌ లిస్టు నుంచి హిట్‌ 2 టీజర్‌ను తొలగించింది. గత నాలుగు రోజులుగా ఈ టీజర్‌ ట్రెండింగ్‌ లిస్టులో 1 నుంచి 4 ప్లేసుల్లో కొనసాగింది. అయితే సడెన్‌గా తీసేశారు. ఏజ్‌రిస్ట్రిక్షన్‌ చేశారు. సైన్ ఇన్ చేసి 18 ఏళ్లు వ‌య‌సున్న వాళ్లని ప్రూవ్ చేసుకుంటే కానీ టీజ‌ర్‌ను చూడ‌లేరు. వ‌యొలెన్స్ క‌దా.. సినిమాకు అదే క‌రెక్ట్‌. పిల్లలు చూడొద్దని మేం ట్వీట్స్‌లో పెట్టాం కూడా’ అని చెప్పుకొచ్చిన శేష్‌ అదే స‌మ‌యంలో రేపు విడుద‌ల‌వుతున్న ఉరికే ఉరికే సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరారు.

ఇవి కూడా చదవండి

కాగా టీజర్‌లోని ఓ సన్నివేశంలో రక్తపుమరకలు, దుస్తులతో ఉన్న డెడ్‌ బాడీ కనిపిస్తుంది. అయితే ఈ విజువల్స్‌ మైనర్లు వీక్షించవద్దని భావించిన యూట్యూబ్‌ 18 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే చూసే అవకాశం కల్పించింది. ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు శేష్‌. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, తనికెళ్లభరణి, కోమలీ ప్రసాద్‌, రావు రమేశ్‌, భాను చందర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జాన్‌ స్టివార్ట్‌ ఏడూరి స్వరాలు సమకూరుస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..