NTR: మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్.. రెండు పార్ట్స్‌గా రానున్న సినిమా

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకుడు కొరటాల. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

NTR: మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్.. రెండు పార్ట్స్‌గా రానున్న సినిమా
Ntr
Follow us

|

Updated on: Jul 31, 2024 | 7:34 PM

ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకుడు కొరటాల. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తారక్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఓ పెద్ద దర్శకుడికి కాదు ఓ యంగ్ డైరెక్టర్ కు.. ఇంతకూ ఆ దర్శకుడు ఎవరంటే.. 

గతేడాది చివర్లో విడుదలైన ‘హాయ్ నాన్న’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శౌర్యవ్.. ఓ అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించాడని తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి ఇంకా రెండేళ్ల సమయం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండేళ్లు షూటింగ్ జరుపుకున్న తర్వాతే సినిమా విడుదల కానుందని అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ‘దేవర’ సినిమాతో పాటు హిందీలో ‘వార్ 2’ సినిమాను కూడా మొదలుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ హిందీ చిత్రంలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈమూవీ భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది. ‘వార్ 2’ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమాలో నటించనున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ శౌర్యవ్ తో సినిమా చేయనున్నాడు.. శౌర్యవ్ దర్శకత్వం వహించే సినిమా 2026లో మొదలై మొదటి భాగం 2028లో విడుదల కానుంది. రెండో భాగం 2030లో విడుదల కానుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..