AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kondapolam: వైష్ణవ్ తేజ్ సినిమా రిలీజ్ డేట్ మారిందా ? కొండపొలం ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పడంటే..

మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

Kondapolam: వైష్ణవ్ తేజ్ సినిమా రిలీజ్ డేట్ మారిందా ?   కొండపొలం ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పడంటే..
Kondapolam
Rajitha Chanti
|

Updated on: Sep 23, 2021 | 2:28 PM

Share

మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ యంగ్ హీరోకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేస్తున్నాడు. కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్ పై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు సంయక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి అడవి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ గ్రామీణ ప్రాంతానికి చెందిన జంటగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని కలిగించాయి. అలాగే…. ఈ సినిమా నుంచి విడుదలైన ఓ ఒబులమ్మ సాంగ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8వ తేదీని ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే గత కొద్ది రోజులు ఈ సినిమా గురించి వరుస కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనూహ్యంగా ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడిందని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడలేదని.. ముందుగా అనుకున్న టైం ప్రకారమే సినిమా విడుదల కాబోతుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. వచ్చే వారం నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. లవ్ అండ్ ఎమోషన్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండడంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: love story: నాగచైతన్య, సాయి పల్లవిల అందమైన ప్రేమకథ.. ప్రేక్షకుల ముందుకు లవ్ స్టోరీ వచ్చేది రేపే..

Shyam Singha Roy: శ్యామ్ సింగ రాయ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్… నాని సినిమా డిజిటల్ రైట్స్ ఎవరు తీసుకున్నారంటే..

Drugs Case: సినీ తారాల డ్రగ్స్ కేసులో ముగిసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ.. విస్తుగొలిపే సంగతులు.!

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..