Sudheer Babu : ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లతో మన ముందుకు రాబోతున్నారు హీరో సుధీర్ బాబు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.. ఇటీవలే శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తన కెరీర్‌లో 15వ చిత్రంగా హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. సోనాలి నారంగ్, సృష్టి సమర్ఫణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సుధీర్ బాబు కోసం ఒక భిన్నమైన కథను రెడీ చేశారు దర్శకుడు హర్ష వర్ధన్. ఈ సినిమాలో ఇంత వరకూ చూడని సరికొత్త అవతారంలో సుధీర్ బాబు కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు(సోమవారం) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నిర్మాత పుస్కుర్ రామ్‌మోహన్ రావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. వచ్చే వారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా పీజీ విందా సినిమాటోగ్రఫి భాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుపనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :