AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త సినిమా షురూ చేసిన రోషన్ కనకాల.. ఈసారి ఎలాంటి మూవీతో రానున్నాడంటే

కొన్ని సినిమాలు ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, ప్రేమ, మిస్టరీ కలిసిన అలాంటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న ఓ భారీ కాన్సెప్ట్ సినిమా ఘనంగా ప్రారంభమైంది. మొన్నా మధ్య మోగ్లీ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు రోషన్.

కొత్త సినిమా షురూ చేసిన రోషన్ కనకాల.. ఈసారి ఎలాంటి మూవీతో రానున్నాడంటే
Roshan
Rajeev Rayala
|

Updated on: Jul 10, 2026 | 8:44 PM

Share

రోషన్ కనకాల, గహజి ప్రధాన పాత్రల్లో సరికొత్త హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్ అధికారికంగా లాంచ్ అయ్యింది. సత్య, సుదర్శన్, రవి తేజ నన్నిమాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయ్ కె కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, డైలాగ్ రైటర్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేసిన విజయ్, ‘టైగర్’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’, ‘డిస్కో రాజా’, ‘స్వయంభు’ వంటి విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ఆయన దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ సినిమాల స్థాయిని తన వినూత్న స్టొరీ టెల్లింగ్ తో మార్చిన విఐ ఆనంద్ అందించిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. గుత్తా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సహకారం అందిస్తోంది. ఆసక్తికరమైన కాన్సెప్ట్, భారీ స్థాయి నిర్మాణంతో ఈ చిత్రం సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.

ఇది కూడా చదవండి : నా పాత్రకు ఇంపార్టెన్స్ లేదు..! కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

కాకతీయ హిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. హీరో నిఖిల్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. విఐ ఆనంద్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేయడమే కాకుండా, ప్రాజెక్ట్‌కు తన శుభాకాంక్షలు అందిస్తూ ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఫాంటసీ, రొమాన్స్, కామెడీ, మిస్టరీ, అత్యాధునిక సైన్స్ ఫిక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం, ఊహలు, భావోద్వేగాలు, అద్భుతమైన దృశ్యాలతో కూడిన ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్లనుంది. పూర్తి స్థాయి థియేట్రికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని, ప్రతి భావోద్వేగం చెరగని ముద్ర వేస్తుందని చిత్ర బృందం హామీ ఇస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!! ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదే..

ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా, అన్వేష్ వరాల సినిమాటోగ్రఫీని, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా, వి.ఐ. ఆనంద్, అనూష వేలుస్వామి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా, బండి భాస్కర్, శైలేంద్ర కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా పని చేస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. చిత్ర నిర్మాతలు త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్, అనేక ఆసక్తికరమైన అనౌన్స్మెంట్స్ చేయనున్నారు.

ఇది కూడా చదవండి : ఆర్ఎక్స్ 100 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నుంచి రావు బహదూర్ వరకు.. అదరగొడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us