AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడి కూర నీచు వాసన లేకుండా మంచి రుచిగా కావాలంటే.. ఇలా చేయండి

చికెన్ కూర నీచు వాసన లేకుండా మంచి రుచిగా చేయాలంటే ఇలా చేయండి. నీచు వాసన లేకుండా, తక్కువ మసాలాలతో ఎంతో రుచికరమైన చికెన్ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా చికెన్‌ను మ్యారినేట్ చేసుకుని ఈ కింది విధంగా వండితే భలేగా ఉంటుంది. దీంతో చికెన్‌లో ఉండే నీచు వాసన తగ్గి రుచి పెరుగుతుంది. అందరూ ఇష్టంగా తింటారు..

Srilakshmi C
|

Updated on: Jul 10, 2026 | 7:52 PM

Share
చాలా సింపుల్‌గా, తక్కువ మసాలాలతో చేసే నీచు వాసన రాని చికెన్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు .. 500 గ్రాముల చికెన్‌, కారం పొడి – 1 టేబుల్ స్పూన్, పసుపు – ¼ టీ స్పూన్, ఉప్పు – 1 టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – 1 టీ స్పూన్, జాపత్రి (Mace) – చిన్న ముక్క, కల్పాసి / స్టోన్ ఫ్లవర్ – కొద్దిగా, కరివేపాకు – 1 రెమ్మ, పచ్చిమిర్చి – 4, ఉల్లిపాయలు – 3 పెద్దవి (సన్నగా తరిగినవి), పసుపు – ¼ టీ స్పూన్, ఉప్పు – అవసరమైనంత, నీరు – 1½ గ్లాసులు, కసూరి మెంతి – 1 టీ స్పూన్ తీసుకోవాలి.

1 / 5
ముందుగా చికెన్ మ్యారినేట్ చేయడానికి.. చికెన్‌ను బాగా కడిగి నీరు పూర్తిగా వంపేయాలి. కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. కనీసం 30 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్‌లో ఉండే నీచు వాసనను తగ్గిస్తుంది. కారం, పసుపు చికెన్‌కు మంచి రుచి కూడా ఇస్తాయి.

2 / 5
ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, జాపత్రి, స్టోన్ ఫ్లవర్ వేసి కొన్ని సెకన్లు వేయించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఈ దశలో వచ్చే సువాసనే కర్రీకి ప్రత్యేక రుచి ఇస్తుంది. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేయాలి. దీనిని మధ్య మంటపై ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది.

3 / 5
ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్‌ను కడాయిలో వేయాలి. ఉల్లిపాయలతో బాగా కలపాలి. తర్వాత మూతపెట్టి 10 నిమిషాలు మధ్య మంటపై ఉడికించాలి. ఈ సమయంలో చికెన్ తన నీటిని వదులుతుంది. ఆ తర్వాత 1½ గ్లాసుల వేడి నీరు పోయాలి. బాగా కలిపి మూతపెట్టాలి. దీనిని 15 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో ఒకసారి కలపాలి.

4 / 5
ఇక చివరిగా కసూరి మెంతిని చేత్తో నలిపి వేయాలి. మరో 3–5 నిమిషాలు మరిగించాలి. నూనె పైకి తేలితే కర్రీ సిద్ధం అయినట్లే. ఈ విధంగా చేస్తే ప్రత్యేకంగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ లేదా ఎక్కువ మసాలాలు లేకుండానే చికెన్ కర్రీ చాలా రుచిగా వస్తుంది.

5 / 5
Follow Us