
టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ దూసుకుపోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కథలతో సినిమాలు తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్నారు. అలాగే అవార్డ్స్ కు అందుకుంటున్నారు.. వారిలో సందీప్ రాజ్ ఒకరు. కలర్ ఫోటో సినిమాతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు ఈ యంగ్ డైరెక్టర్. కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించిన సందీప్ రాజ్ ఆతర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తో పాటు పలు హిట్ సినిమాలకు రచన – దర్శకత్వ విభాగంలో వర్క్ చేసాడు.
ఆ తర్వాత దర్శకుడిగా మారి సుహాస్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా కలర్ ఫోటో అనే సినిమా చేసాడు సందీప్. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలైంది. మంచి లవ్ స్టోరీ తో పాటు చక్కని ఎమోషన్స్ తో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు సందీప్ రాజ్. దాంతో ఇప్పుడు ఈ కుర్ర దర్శకుడితో సినిమా చేయడానికి పలువురు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే నటుడిగాను దూసుకుపోతున్నాడు సందీప్ రాజ్. రీసెంట్ గా సందీప్ ఎయిర్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.
తాజాగా సందీప్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేను ఏ హీరో దగ్గరకు వెళ్లినా వారి అంచనాలను మించేలా కథ చెప్తా దాంతో బడ్జెట్ ఎక్కువవాడుతుంది దాంతో సినిమా సెట్ అవ్వదు ఓ సినిమా కోసం రవితేజతో ట్రావెల్ చేశాను.. రవితేజ చుట్టూ తిరుగుతుండటంతో నీ గోల్డెన్ టైం వెస్ట్ చేసుకోకు అబ్బాయ్.. నేను ఇంకా రెండు సినిమాలు కమిట్ అయ్యాను.. అన్నారు. అప్పటికే మూడేళ్లు అయ్యింది సరే సార్ నేను వేరొక కథ చేసి వస్తాను అని చెప్పా.. గుడ్. హ్యాపీగా సినిమా చేసుకో టైం వెస్ట్ చేసుకోకు.. నాకు చెప్పిన కథ ఇంకెవరితో అయినా తీస్తే చంపేస్తా.. అన్నారు. దానికి నేను సార్ అది మీకోసం రాసిన కథ మీతోనే చేస్తా అని చెప్పాను అని సందీప్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.