
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర్ వీర్ మల్లు’ సినిమా జులై 24న దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మతం కారణంగా హిందువులపై జరిగే దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడే యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఔరంగజేబుతో పోరాడే యోధుడి గాథగా ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్‌ను చిత్ర బృందం ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్‌లోనూ పాల్గొనలేదు. దీంతో ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ను భారీ ఎత్తున నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హరి హర వీర మల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అతిథిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
హరి హర వీర మల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను రెండు చోట్ల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొదట జులై 17న వారణాసిలో జరిగే ఈవెంట్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలుస్తోంది. యోగితో పాటు ఉత్తరప్రదేశ్ మంత్రులు, భోజ్ పురి చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది నటులు కూడా ఈ కార్యక్రమానిక వస్తారని ప్రచారం జరుగుతోంది.
దీని తర్వాత జూలై 19న తిరుపతిలో జరగనున్న ‘హరి హర వీర మల్లు’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌరవ అతిథిగా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ఈ మూవీ ఈవెంట్ కు రానున్నారని తెలుస్తోంది. ‘హరి హర వీర మల్లు’ చిత్రానికి జాగర్ల మూడి క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. దయాకర్ రావు, ఎఎం రత్నం నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
July 7th Varanasi Hari Hara veera Mallu event will mostly happening
Chief guest : Yogi Adityanath
Kalyan ❤️Yogi 🙏
God level event happening 🙏 👍 #hariharaveermallu #HHVMonJuly24th #HHVMonJuly24th #Pawankalyan#RamCharan #Hindistan #RSS_Mukt_Bharat pic.twitter.com/PrBSp8DNRq— Ustaad_🦅🏸 (@ustaad_) July 6, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..