AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2023: ఈ ఏడాది బాలీవుడ్‌కు బాగానే కలిసొచ్చిందిగా.. హిట్ సినిమాలు ఎన్నంటే..

స్టార్ హీరోల సినిమాకు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. ఇక ఈ ఏడాది మాత్రం బాలీవుడ్ బాగానే పుంజుకుంది. 2023 సంవత్సరం ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు భారీగా వసూళ్లు రాబట్టాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం..

Year Ender 2023: ఈ ఏడాది బాలీవుడ్‌కు బాగానే కలిసొచ్చిందిగా.. హిట్ సినిమాలు ఎన్నంటే..
Bollywood
Rajeev Rayala
|

Updated on: Dec 08, 2023 | 11:39 AM

Share

బాలీవుడ్ కు ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది చెప్పాలి. గత ఏడాది బాలీవుడ్ లో చాల ఫ్లాప్స్ పలకరించాయి. దాంతో బాలీవుడ్ పని అయిపొయింది అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. స్టార్ హీరోల సినిమాకు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. ఇక ఈ ఏడాది మాత్రం బాలీవుడ్ బాగానే పుంజుకుంది. 2023 సంవత్సరం ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు భారీగా వసూళ్లు రాబట్టాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం..

యానిమల్… ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంది యానిమల్. ఎందుకంటే డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.550 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత స్థానంలో నిలిచిన సినిమా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ పఠాన్.

పఠాన్– ది కింగ్ ఆఫ్ బాలీవుడ్ అంటే షారుఖ్ ఖాన్ అనే చెప్పాలి. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుక్ ‘పఠాన్’ సినిమాతో హిట్ అందుకున్నాడు. కింగ్ ఖాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇండియాలో ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అలాగే వరల్డ్ వైడ్ గా ఏకంగా 1000 కోట్ల వరకు వసూల్ చేసింది ఈ సినిమా.

జవాన్– బ్లాక్ బస్టర్ హిట్స్ లో షారుఖ్ ఖాన్ మరో సినిమా జవాన్ కూడా ఉంది. ‘జవాన్‌’లో ద్విపాత్రాభినయం చేశాడు షారుక్. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నటి దీపికా పదుకొనే ‘పఠాన్’ మరియు ‘జవాన్’ రెండు చిత్రాలలో నటించింది. అలాగే వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా వసూల్ చేసింది.

గదర్ 2– సన్నీ డియోల్, అమీషా పటేల్ ల సూపర్ హిట్ పెయిర్ 22 ఏళ్ల తర్వాత ‘గదర్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తారా సింగ్ , సకీనాల కథ మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు వసూలు చేసింది.

టైగర్ 3– సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ దీపావళి సందర్భంగా విడుదలైంది.  సల్మాన్, కత్రినా కైఫ్‌ల హిట్ జోడీ టైగర్ 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘టైగర్ 3’ చిత్రం ఇప్పటి వరకు రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది.ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఫుక్రే 3– రిచా చద్దా, పుల్కిత్ సామ్రాట్ నటించిన చిత్రం ‘ఫుక్రే 3’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. కేవలం 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

OMG 2– అక్షయ్ కుమార్ , పంకజ్ త్రిపాఠి నటించిన OMG 2 ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఈ చిత్రం సన్నీ డియోల్  గదర్ 2తో పాటు విడుదలైంది. భారీ పోటీ ఉన్నప్పటికీ అక్షయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.221.08 కోట్లు వసూలు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.