Yatra 2 Movie: ‘తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు’.. ‘యాత్ర 2 ‘ డిలీటెడ్‌ సీన్‌ రిలీజ్‌.. మీరూ చూశారా?

|

Feb 09, 2024 | 8:47 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన చిత్రం యాత్ర 2. 2019లో రిలీజై సూపర్‌ హిట్‌ గా నిలిచిన యాత్ర సినిమాకు ఇది సీక్వెల్‌. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించగా, సీఎం జగన్మోహన్‌ రెడ్డి పాత్రలో కోలీవుడ్‌ హీరో జీవా కనిపించారు.

Yatra 2 Movie: తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు.. యాత్ర 2  డిలీటెడ్‌ సీన్‌ రిలీజ్‌.. మీరూ చూశారా?
Yatra 2 Movie
Follow us on

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన చిత్రం యాత్ర 2. 2019లో రిలీజై సూపర్‌ హిట్‌ గా నిలిచిన యాత్ర సినిమాకు ఇది సీక్వెల్‌. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించగా, సీఎం జగన్మోహన్‌ రెడ్డి పాత్రలో కోలీవుడ్‌ హీరో జీవా కనిపించారు. యాత్ర మూవీ సూపర్‌ హిట్‌ కావడం, త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో యాత్ర 2 పై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగానే గురువారం ( ఫిబ్రవరి 8) రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి సూపర్‌ హిట్ టాక్‌ తెచ్చుకుంది. డీసెంట్‌ కలెక్షన్లు రాబడుతోంది. మొదటి రోజు యాత్ర 2 సినిమాకు సుమారు రూ. 6 నుంచి 8 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు వచ్చాయంటున్నారు ట్రేడ్ నిపుణులు. థియేటర్లలో సక్సెస్‌ ఫుల్‌ గా రన్‌ అవుతోన్న యాత్ర 2 సినిమా నుంచి ఒక సర్ ప్రైజ్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ మూవీ నుంచి ఒక డిలీటెడ్ సీన్ ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ఇందులో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి మరణానంతరం ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, జగన్‌ ను సీఎం చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించడం, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు జగన్‌ పై బురద చల్లేందుకు పన్నాగాలు పన్నడం ఇందులో చూడచ్చు.

ముఖ్యంగా చంద్రబాబు పాత్రలో బాలీవుడ్‌ నటుడు మహేశ్‌ మంజ్రేకర్‌ చెప్పిన డైలాగులు హైలెట్ గా నిలిచాయి. ‘తండ్రిపోయాడనుకుంటే కొడుకొచ్చాడు. తండ్రి చావే వాడి (జగన్) రాజకీయ బలమైతే, దానినే వాడి బలహీనతగా మార్చండి. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సీఎం అయ్యేందుకు సంతకాలు సేకరిస్తూ శవ రాజకీయాలు చేస్తున్నాడని ప్రచారం చేయండి, జనాలను నమ్మించండి. ఒక అబద్ధాన్ని వార్తగా చేసి, నిజమని నమ్మించడానికి మన దగ్గర టీవీ ఛానెల్స్‌, పేపర్స్‌ ఉన్నాయి కదా’ అని డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. మరి మీరు కూడా ఈ యాత్ర 2 డిలీటెడ్‌ సీన్ ను చూసేయండి మరి.

ఇవి కూడా చదవండి

‘యాత్ర 2 ‘ డిలీటెడ్‌ సీన్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.