AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాపై ఎలాంటి కుట్రలు జరగడం లేదు

‘కేజీఎఫ్‌’తో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్‌కు ప్రాణహాని ఉందని, ఆయనను ఎవరో చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఇటీవల పలు కన్నడ మీడియాల్లో వార్తలు హల్‌చల్ చేశాయి. దాంతో ఆయన అభిమానులు, కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై యశ్ క్లారిటీ ఇచ్చారు. నన్నెవరూ చంపాలనుకోవడం లేదు. నేను బెంగళూరు ఏసీపీతో కూడా మాట్లాడను. నాపై ఎలాంటి కుట్ర జరగడం లేదు. ఇలాంటి వదంతుల వల్ల ముందు ముందు ఎలాంటి సంఘటనలు […]

నాపై ఎలాంటి కుట్రలు జరగడం లేదు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 11, 2019 | 1:14 PM

Share

‘కేజీఎఫ్‌’తో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్‌కు ప్రాణహాని ఉందని, ఆయనను ఎవరో చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఇటీవల పలు కన్నడ మీడియాల్లో వార్తలు హల్‌చల్ చేశాయి. దాంతో ఆయన అభిమానులు, కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై యశ్ క్లారిటీ ఇచ్చారు.

నన్నెవరూ చంపాలనుకోవడం లేదు. నేను బెంగళూరు ఏసీపీతో కూడా మాట్లాడను. నాపై ఎలాంటి కుట్ర జరగడం లేదు. ఇలాంటి వదంతుల వల్ల ముందు ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని భయంగా ఉంది. ఎవరైనా ఓ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ అయ్యాడంటే నా లైఫ్‌కు రిస్క్ ఉందని అనేస్తున్నారు. నేనేం గొర్రెను కాదు. ఎవడుపడితే వాడు వచ్చి నరికేయడానికి. నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. అసలు ఈ విషయాలన్నీ మీడియాకు ఎవరు చేరవేస్తున్నారో నాకు తెలీడం లేదు. మున్ముందు ఇలాంటి సంఘటలు జరిగితే మన కన్నడ పరిశ్రమపై చెడు ప్రభావం పడుతుంది అంటూ యశ్ పేర్కొన్నారు.

Follow Us