Yash: మీరు గోల్డ్ ఎహే..అసిస్టెంట్‌కు యశ్ సర్‌ప్రైజ్.. పుట్టిన బిడ్డకు గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చి.. వీడియో

కేజీఎఫ్‌ 2 సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు రాకింగ్‌ స్టార్‌ యశ్‌. అయితే ఎట్టకేలకు ఇటీవలే తన కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు. ఈసారి టాక్సిక్‌ అంటూ మరో పాన్‌ ఇండియా మూవీతో మన ముందుకు రానున్నారు రాఖీ భాయ్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉంటున్నాడు యశ్‌.

Yash: మీరు గోల్డ్ ఎహే..అసిస్టెంట్‌కు యశ్ సర్‌ప్రైజ్.. పుట్టిన బిడ్డకు గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చి.. వీడియో
Hero Yash Family

Updated on: Feb 15, 2024 | 1:07 PM

కేజీఎఫ్‌ 2 సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు రాకింగ్‌ స్టార్‌ యశ్‌. అయితే ఎట్టకేలకు ఇటీవలే తన కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు. ఈసారి టాక్సిక్‌ అంటూ మరో పాన్‌ ఇండియా మూవీతో మన ముందుకు రానున్నారు రాఖీ భాయ్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉంటున్నాడు యశ్‌. కేజీఎఫ్‌2 తర్వాత చాలా గ్యాప్ రావడంతో వీలైనంత త్వరగా ట్యాక్సిక్‌ షూటింగ్‌ ను పూర్తి చేసి అభిమానులకు అందించాలనుకుంటున్నాడు రాకింగ్‌ భాయ్‌. సినిమా షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా తన వారి కోసం టైమ్‌ కేటాయిస్తుంటాడు రాకీ భాయ్‌. ముఖ్యంగా అభిమానులు, తన సిబ్బంది కుటుంబాల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే తప్పకుండా హాజరవుతాడు. తన సతీమణి రాధికా పండిట్‌ తో కలిసి వేడుకలకు వెళుతుంటారాయన. తాజాగా ‘టాక్సిక్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న యశ్‌.. తన అసిస్టెంట్‌ ఇంటికి వెళ్లాడు. తన సతీమణితో కలిసి వెళ్లి వారిని సర్‌ప్రైజ్‌ చేశారు. చేతన్‌ అనే వ్యక్తి యశ్‌ దగ్గర సుమారు 12 ఏళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే యశ్‌ సినిమా కెరీర్‌ ప్రారంభం నుంచి చేతన్‌ హీరోకు తోడుగా ఉన్నాడు. చేతన్‌ రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. బెంగళూరులోని ప్యాలెస్‌ గ్రాండ్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఆ సమయంలో కూడా యశ్‌, రాధిక దంపతులు దగ్గరుండి చేతన్‌ పెళ్లి వేడుకలు జరిపించారు.

 

ఇవి కూడా చదవండి

ఇటీవల చేతన్‌ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. తాజాగా ట్యాక్సిక్‌ సినిమా షూటింగ్‌లో ఉన్న యశ్‌ ఈ శుభ సందర్భంలో చేతన్ ఇంటికి వెళ్లాడు. తన సతీమణితో కలిసి చేతన్‌ ఫ్యామిలీకి సర్‌ ప్రైజ్‌ ఇచ్చాడు. అంతేకాదు వారి బిడ్డకు బంగారు గొలుసును గిఫ్ట్‌ గా ఇచ్చాడు. దీంతో చేతన్‌ కుటుంబ సభ్యులు చాలా హ్యాఫీగా ఫీలయ్యారు. పాన్ ఇండియా రేంజ్‌ లో క్రేజ్ ఉన్నా యశ్‌ ఎంతో సింప్లిసిటీగా అసిస్టెంట్‌ ఇంటికి వెళ్లడం, వారిని సర్‌ప్రైజ్‌ చేయడాన్ని అభిమానులు మెచ్చకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

అసిస్టెంట్ ఫ్యామిలీతో యశ్, రాధికా దంపతులు..

రాకీ భాయ్ న్యూ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..