సెలబ్రెటీలే టార్గెట్‌గా అక్రమ వసూళ్లకు పాల్పడిన శిల్పా చౌదరి వార్త అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపింది. తాజాగా మరో మహిళ నటుడు నరేష్ పేరిట భారీ మోసానికి పాల్పడింది. ‘మా’ మాజీ అధ్యక్షుడు,సీనియర్ నటుడు నరేష్ (Naresh) పేరున రమ్య రఘుపతి అనే మహిళ పలువురు మహిళల దగ్గర డబ్బు వసూళ్లకు పాల్పడింది. ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన మహిళల నుండి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు.
నరేష్ ఫ్యామిలీతో రమ్యరఘుపతి పలు సందర్భాల్లో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు అడ్డం పెట్టుకుని చూపించి సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు మరికొందరు మహిళల నుండి ఆమె లక్షల రూపాయలు వసూలు చేశారు. హైదరాబాద్ తో పాటు అనంతపూర్, హిందూపురంలో పలువురి వద్ద నుండి ఆమె నరేష్, కృష్ణ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసినట్టుగా తెలిసింది. అయితే, ఈ వివాదంపై నటుడు నరేష్ స్పందించారు. రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే రమ్య రఘుపతితో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Ghani: మెగా అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. బాబాయ్ సినిమా కోసం గని వెనకడుగు..
Samantha: “ఐ వాన రీ ప్రొడ్యూస్ యూ”.. నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సమంత..